
రోజంతా అలసిపోయిన తర్వాత, రాత్రి పడుకునే ముందు స్నానం చేస్తే రిలాక్స్‌గా అనిపిస్తుంది, మంచి నిద్ర పడుతుందని చాలా మంది భావిస్తారు. అయితే, రాత్రిపూట స్నానం చేయడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాత్రిపూట స్నానం చేయడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇది కొనసాగితే ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. రాత్రి భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది, అజీర్ణ సమస్యలు ఏర్పడవచ్చు. భోజనం తరువాత శరీర ఉష్ణోగ్రత జీర్ణక్రియకు సహాయపడుతుంది, కానీ స్నానం దానిని నియంత్రిస్తుంది, ఇది జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది.
నిద్రలేమి: రాత్రి సమయంలో సహజంగా తగ్గే శరీర ఉష్ణోగ్రత నిద్రకు సంకేతం ఇస్తుంది. కానీ స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీని కారణంగా నిద్ర పట్టడంలో ఇబ్బంది కలగవచ్చు. రాత్రిపూట స్నానం చేయడం కండరాలకు మంచిది కాదని, దీనివల్ల కీళ్ల నొప్పులు, కండరాల తిమ్మిరి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు.
రాత్రి భోజనం చేసిన తర్వాత స్నానం చేయడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉందని, ఇది స్థూలకాయం మరియు మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు తడి జుట్టుతో నిద్రపోవడం ప్రమాదకరం: రాత్రిపూట తలస్నానం చేసి, జుట్టు సరిగా ఆరకముందే నిద్రపోతే అది సైనస్, జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలకు దారితీస్తుంది. తడి దిండు లేదా పరుపుపై బ్యాక్టీరియా పెరగడానికి కూడా అవకాశం ఉంది.
రాత్రిపూట స్నానం చేసిన వెంటనే పడుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడవచ్చు. దీనివల్ల సులభంగా ఇన్ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. రాత్రిపూట స్నానం చేయాలనుకుంటే, నిద్రపోవడానికి కనీసం రెండు గంటల ముందు స్నానం చేయడం ఉత్తమం. చలికాలంలో గోరువెచ్చని నీటితో, వేసవిలో సాధారణ నీటితో స్నానం చేయడం మంచిది. తలస్నానం చేస్తే జుట్టును పూర్తిగా ఆరబెట్టుకోవాలి.