సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా నారావారిపల్లెకు రావడం జరిగింది. ఈ సందర్భంగా  నారావారిపల్లెలో  ఒక అనూహ్యమైన సంఘటన చోటుచేసుకుంది. సీఎం తమ ఊరికి రావడంతో ప్రజలు ఎంతో ఆనందభరితులయ్యారు. ఈ క్రమంలో ఆయన్ని కలిసి తమ సమస్యలు చెప్పుకోవాలని నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు ఇంటికి తరలివచ్చారు. అక్కడ సీఎంకు స్థానికులు తమ సమస్యలపై అర్జీలు అందజేయడం మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి ఇల్లు కాబట్టి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

దీంతో ట్రాఫిక్ కు కలగడంతో ఆ వైపుగా వెళ్లాల్సిన వాహనాలు కిలోమీటర్లు మేరకు ఆగిపోవడం జరిగింది. ఇదే సమయంలో చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం దిగువ మూర్తిపల్లెకు చెందిన నవీన్ హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి తన కుటుంబంతో కలిసి బయల్దేరారు. ఈ క్రమంలో ట్రాఫిక్ ఎందుకు అంతరాయం కలిగింది తెలుసుకొని కాలి నడకన బయలు దేరారు సి.ఎం ఇంటి వద్ద వరకు చేరి  సీఎం భద్రత కోసం సామాన్యులైన మమ్మల్ని  ఇబ్బంది పెడతారా అంటూ ఆగ్రహానికి  గురయ్యారు. 

కిలోమీటర్ దూరం కుటుంబంతో కలిసి నడవడం వల్ల తనకు కలిగిన ఇబ్బందిని అక్కడి పోలీసులు ముందు వ్యక్తపరిచారు. పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అదంతా గమనించిన సీఎం చొరవ తీసుకుని, సమస్యను అర్థం చేసుకుని నవీన్‌కు సారీ చెప్పాడు. వెంటనే ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరిచమని పోలీసులను ఆదేశించారు. ఓ సామాన్యుడికి సీఎం సారీ చెప్పడంతో అక్కడున్న నాయకులు, కార్యకర్తలు హర్షధ్వానాలు తెలిపి ‘సీఎం జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: