పవన్ కళ్యాణ్ రాజకీయ అనుభవ లేమి ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తోంది. జాన్సెన పార్టీ ఆవిర్భావం నుండి రాజకీయాలపై చురుకుగా ఉన్నప్ప్పటికీ, కొన్ని రాజకీయ పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమయ్యాడని చెప్పాలి. ఎందుకంటే గతంలో పార్టీ పెట్టక ముందు నుండీ పవన్ టీడీపీ కి సపోర్ట్ గా ఉన్న విషయం తెలిసిందే. 2014 లో టీడీపీ తరపున ప్రచార కార్యక్రమాల్లో కూడా జోరుగా పాల్గొన్నారు. అక్కడ టీడీపీకి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ బాగా కలిసొచ్చింది. అదే విధంగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీడీపీ వారు జనసేన పార్టీ మాతోనే ఉంది అని ప్రచారంలో బాగానే వాడుకున్నారు. కానీ అది అవాస్తవమని ప్రజలకు చెప్పడంలో జనసేన ఫెయిల్ అయింది. ఈ కారణంగా టీడీపీపై ప్రజలకున్న ఆగ్రహం జనసేన పై కూడా పడడంతో, పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసినా గెలవలేకపోయారు.

 అయితే ఆ తావతా ప్రస్తుతం ఏపీలో నగర పాలిత ఎన్నికల సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు మళ్ళీ అదే పాత పాడుతున్నారు. ఈ సారి ఒక అడుగు ముందుకేసి మరీ బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. అటు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దగ్గర నుండి, నరసాపురం, రామచంద్రాపురం, జంగారెడ్డి గూడెం ఇలా పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు జాన్సెనకు మద్దతుగా ప్రచారాలు చేసిన సంగతి తెలిసిందే.  తాజాగా కడప జిల్లాలో జనసేన తరపున 25 వ వార్డ్ కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న రంజిత్ కు మద్దతుగా టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ కూడా ప్రచారం చేసినట్లు సమాచారం. అయితే ఈ విధంగా ఓపెన్ గా ప్రచారం చేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటి. కానీ దీనిపై జనసేన మాత్రం మేము టీడీపీ తో కలవడం లేదు.

ఈ వ్యాఖ్యలతో మాకు ఎటువంటి సందర్భం లేదని చెబుతూ వస్తోంది. ఇదంతా చూస్తుంటే జనసేన వలన టీడీపీకి ఎంతవరకు ఉపయోగం ఉందో తెలియడం లేదు. కానీ ఇక్కడ రెండు విషయాలు అర్ధం కావడం లేదు. టీడీపీ కావాలనే జనసేనతో కాళ్లభేరానికి వస్తోందా...లేదా దీని వలన మనకు కొన్ని సీట్లు వస్తాయని, వారు వేస్తున్న ప్రణాళికలో భాగమా ...ఏది ఏమైనా జనసేన పార్టీకి టీడీపీ బలమా బలహీనతా తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: