కేవీపీ రామ‌చంద్రరావు. దివంగ‌త ముఖ్య‌మంత్రి, ప్రస్తుత ఏపీ సీఎం జ‌గ‌న్ తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి అత్యంత సన్నిహిత నాయ‌కుడు. కేవీపీ బావ‌మ‌రిది, వైఎస్సార్ వీరాభిమాని, మాజీ మంత్రి కోట‌గిరి విద్యాధ‌ర‌రావు అనుంగు శిష్యుడు అయిన‌ మేడ‌వ‌ర‌పు అశోక్ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గంతో పాటు మెట్ట ప్రాంత రాజ‌కీయాల్లో రెండు ద‌శాబ్దాలుగా కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాజ‌కీయంగా పై స్థాయిలో సీఎం జ‌గ‌న్ నుంచి ఎంతో మంది మంత్రులు, ఎమ్మెల్యేల‌తో స‌న్నిహిత సంబంధాలు ఉన్నా... ఆయ‌న వాటిని చెప్పుకోవ‌డానికంటే వారితో ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే ప‌నులు చేయించ‌డంలోనే ముందుంటారు.

వైఎస్ మ‌ర‌ణాంత‌రం ఏపీలో మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో అశోక్ 2014 ఎన్నిక‌ల‌కు ముందు నుంచే జ‌గ‌న్ వెంటే ఉన్నారు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు నుంచే పార్టీ ఓడినా.. ఇప్పుడు గెలిచినా ఆయ‌న ఎప్పుడూ జ‌గన్‌తోనే జ‌ర్నీ కొన‌సాగిస్తున్నారు. పశ్చిమ గోదావ‌రి జిల్లా చింత‌ల‌పూడి నియోజ‌క వ‌ర్గానికి చెందిన అశోక్ కాంగ్రెస్ పాల‌న‌లో ఏఎంసీ చైర్మ‌న్‌గా కూడా ప‌నిచేశారు. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలో వైసీపీ విజ‌యంలో మెట్ట ప్రాంతంలో అశోక్ పాత్ర కీల‌కం. తాజా పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ద‌శాబ్దాలుగా ఒకే వ‌ర్గం ఆధీనంలో ఉన్న పంచాయ‌తీలు సైతం వైసీపీ ఖాతాలో ప‌డేలా చేయ‌డంలో అశోక్ ఒంటిచేత్తో చ‌క్రం తిప్పారు.

2019 సాధార‌ణ ఎన్నిక‌ల త‌ర్వాత చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ మ‌రింత బ‌ల‌ప‌డంలో అశోక్‌ది కీల‌క పాత్రే అని చెప్పాలి. తాజాగా ఆయ‌న‌ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను క‌లిశారు. దాదాపు అర‌గంట‌కు పైగా సీఎం జ‌గ‌న్‌కు ప‌లు అంశాలు వివ‌రించారు. తాజా రాజ‌కీయ ప‌రిస్థితులతో పాటు చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గంతో పాటు కామ‌వ‌ర‌పుకోట మండ‌ల వైసీపీలోనే నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితులను కూడా అశోక్ సీఎం జ‌గ‌న్‌కు వివ‌రించారు. అశోక్ జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డం ఇప్పుడు చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గ‌‌ అధికార పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: