ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్లో  పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  గత కొంత కాలం నుంచి ఆప్ఘనిస్థాన్లో ఆధిపత్యం కోసం ఎన్నో అరాచకాలు చేస్తుంది తాలిబన్ల సైన్యం. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ లోని పలు బేస్ లలో ఉన్న అమెరికా సైన్యం ఉపసంహరించుకున్న నాటి నుంచి తాలిబన్లు మరింత రెచ్చిపోతున్నారు. దేశంలోని కీలక నగరాలపై కన్నేసిన తాలిబన్లు ఇక ఎన్నో ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే అటు ప్రభుత్వంలోని నాయకులను ఆఫ్గనిస్థాన్లో సైన్యాన్ని కూడా బయట పెట్టేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్ సైన్యం తాలిబన్లను హతమార్చేందుకు ఎప్పటికప్పుడు దాడులు చేస్తూనే ఉంది.



 అయితే ఇక ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వం తాలిబన్లపై దాడులు చేయడానికి అటు అమెరికా ప్రభుత్వం నుంచి కూడా పూర్తిస్థాయి మద్దతు అందుతుంది అనే చెప్పాలి.
 అయితే అటు ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వం ఓవైపు తాలిబన్ మూకలపై దాడులు చేసినప్పటికీ తాలిబన్లు  మాత్రం ప్రభుత్వం చర్యలకు దీటుగా మరింత రెచ్చిపోతున్నారు. ఎంతో మందిని పొట్టన పెట్టుకుంటున్నారు. ఇప్పటికే తాలిబన్ల బారినపడి వందల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇంకెంతో మంది ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.  ఇలా ఆఫ్ఘనిస్తాన్లో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో కూడా అర్థం కాని విధంగా మారిపోయింది పరిస్థితి.



 ఇలాంటి సమయంలో ఇటీవలే ఏకంగా తాలిబన్లు  భారత్కు ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారిపోయింది. ఆఫ్ఘనిస్తాన్లో భారత్ చేపట్టిన అభివృద్ధి ప్రశంసించదగినది అంటూ తాలిబన్ అధికార ప్రతినిధి మహమ్మద్ సుహైల్ షాహిన్ అన్నారు. అందుకే భారత రాయబార కార్యాలయంపై తాము దాడులు నిర్వహించబోము అంటూ స్పష్టం చేశారు   కానీ ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీకి భారత్ సహాయం చేయకపోతే భారత్కు అన్ని విధాలుగా మంచిది అంటూ ఇన్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు.   సైనిక జోక్యం చేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పటికే అర్థమై ఉంటుంది అని ఇతర దేశాల జోక్యాన్ని అసలు సహించబోమని అంటూ స్పష్టం చేశారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: