శ్రావణ భార్గవి అన్నమయ్య కృతులకు అభినయించిన ఓ వీడియో సెన్సేషనల్ గా మారింది. అయితే ఆ వీడియో వెనక ఆడియోని తీసివేసి శ్రావణ భార్గవి ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. కానీ ఈ విషయంలో మీడియా రెండుగా చీలిపోయింది. శ్రావణ భార్గవికి మద్దతిచ్చేవర్గం ఒకటి, ఆమె వీడియోని విమర్శిస్తూ అన్నమయ్య వంశస్తులకు మద్దతుగా మాట్లాడిన వర్గం ఒకటి. అయితే చివరకు ఈ వివాదం సింపుల్ గా పరిష్కారమైపోవడం ఇక్కడ విశేషం. అయితే ఇప్పుడే అసలు సమస్య మొదలైంది. శ్రావణ భార్గవి ఫేమస్ సింగర్ కాబట్టి ఆమెపై కేసు పెట్టడం వరకు వెళ్లింది వ్యవహారం. కానీ చాలామంది ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వికృతాలకు పాల్పడుతుంటారు. మరి వారిని ఎవరూ ఏమీ చేయలేరా..? అసలు శ్రావణ భార్గవి చేసింది తప్పేనా అనే చర్చ మొదలైంది.

'ఒకపరి ఒకపరి' అనే అన్నమయ్య కృతిని బ్యాక్ గ్రౌండ్ ఆడియోలో పెట్టి, శ్రావణ భార్గవి ఓ వీడియోని షూట్ చేసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. ఆ పాట కోసం ఆమె అభినయించారు. అయితే ఆపాట యూట్యూబ్ లో బాగా ట్రెండింగ్ కావడంతో అన్నమాచార్య కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారు. అయితే అసుల ఆ పాట అన్నమయ్య రాసింది కాదని, అన్నమయ్య కుమారుడు తిరుమాలాచార్యులు రాసిన పాట అనే వాదన కూడా వినిపించింది. మొత్తానికి ఈ పాటపై తీవ్ర చర్చ నడిచింది. శ్రావణ భార్గవి క్షమాపణ చెప్పాలనే డిమాండ్ తోపాటు, ఆమెపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు.

అయితే ఈ పాటలో పెద్దగా అసభ్యత లేదని కొందరి వాదన. కావాలనే ఈపాటపై రాద్ధాంతం చేశారని అంటున్నారు. పనిలో పనిగా వీరంతా శ్రావణ భార్గవి వ్యక్తిగత జీవితంపై కూడా విమర్శలు చేశారని అంటున్నారు. ముందు అన్నమాచార్యుల కుటుంబ సభ్యులతో మాట్లాడిన శ్రావణ భార్గవి ఆ పాటలో తప్పేమీ లేదని వివరణ ఇచ్చారు. చివరకు ఈ వివాదం పెరిగి పెద్దది కావడంతో ఆ పాటను యూట్యూబ్ నుంచి తొలగించి, ఆడియో మార్చేశారు. అక్కడితో ఆ వివాదం సద్దుమణిగింది. అయితే ఆ పాట విషయంలో సగం మీడియా శ్రావణ భార్గవికి సపోర్ట్ చేడయం విశేషం. వుయ్ స్టాండ్ విత్ శ్రావణ భార్గవి అంటూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టింగ్ లు కూడా పెట్టారు. అయితే వివాదం పెద్దది చేయడం ఇష్టం లేక ఆమె ఆడియో డిలీట్ చేయడంతో అంతా సద్దుమణిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: