మీ అందాన్ని రెట్టింపు చేసుకోవాలంటే కచ్చితంగా మీరు దీన్ని ఫాలో అవ్వాల్సిందే.... బంగాళ దుంప అందాన్ని పెంచుకోవడానికి బాగా ఉపయోగ పడుతుంది. దీంతో మీ అందం మరింత రెట్టింపు అవుతుంది. బంగాళదుంప కేవలం తినడానికి మాత్రమే కాదు వివిధ రకాలగా కూడా ఉపయోగపడుతుంది. చర్మం కాంతివంతంగా ఉండాలన్నా, జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్నా ఇలా ఎన్నో.. అయితే తప్పకుండా ట్రై చేసి మీ అందాన్ని మరింత పెంచుకోండి.

 

సహజంగా బంగాళదుంప లో పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఒక బంగాళ దుంపలో 26 గ్రాములు పిండి పదార్ధం మనకి లభిస్తుంది, అలాగే విటమిన్-సి, విటమిన్ బి6 పొటాషియం కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. బంగాళ దుంపని  కళ్ళ కింద పెట్టుకుంటే నల్ల మచ్చలు తొలగి పోతాయి. దీనిని గుండ్రంగా తరుక్కుని కొంచెం సేపు పాటు ఫ్రిజ్ లో పెట్టాలి. ఆ తర్వాత కళ్ళ కింద పెట్టుకుంటే నల్ల మచ్చలు మాయం అయిపోతాయి. కాబట్టి నల్ల మచ్చల తో సతమతమయ్యే వాళ్లు ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి.

 

అలానే బంగాళదుంపని పేస్టులా చేసుకుని ముఖానికి రాసుకుని అర గంట తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా మారి ఛాయ కూడా పెరుగుతుంది. దీంతో పాటుగా జిడ్డు కూడా తొలగిపోతుంది అదే బంగాళ దుంప ముక్కల్లో మీరు కొంచెం నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి పట్టించి పావు గంట తర్వాత కడిగేస్తే చర్మం రంగు కూడా తేలుతుంది.  

 

ముల్తాని మట్టి లో చెంచా అల్లం రసం నాలుగు చుక్కలు రోజ్ వాటర్ కలిపి 15 నిమిషాల పాటు ఉంచి గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా ఉంటుంది. చూశారు కదా బంగాళదుంప వల్ల కలిగే ప్రయోజనాలు. మరి మీరు కూడా బంగాళ దుంపతో మీ అందాన్ని మరెంత పెంచుకోండి ఆలస్యం చేయకుండా ఈ సులువైన టిప్స్ ని ఫాలో అయిపోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: