వై.ఎస్.షర్మిల... ప్రస్తుత రాజకీయాలలో పరిచయం అక్కర లేని పేరు. అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి గారాల పట్టి. ఇంకా చెప్పాలంటే విభజన తరువాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్వయాన సోదరి. ఆమె తెలంగాణ  ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఫైర్ అయ్యారు.. ఎందుకో తెలుసా ? వైఎస్ ఆర్ టిపి పార్టీ అధినేత గా ఉన్న షర్మిలకు కోపం వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై ఆమె చురకలు వేశారు.
ఉత్తర భారత దేశాన జరుగుతున్న ఎన్నికల పై మాట్లాడుతూ కేసీఆర్ యూపీలో ప్రచారం చేయడం అనేది పెద్ద జోక్ గా అభివర్ణించారామే.  కేసీఆర్ దేశరాజకీయాలలోకి వెళ్తే లక్షల్లో ఆత్మహత్యలు జరుగుతాయని అన్నారు షర్మిల. దేశాన్నే అమ్మే పరిస్థితి వస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు  వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఇదే సమయంలో  కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పై  కూడా విమర్శలు గుప్పించారు షర్మిల. రైతుల గురించి బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడరు? అని ప్రశ్నించారు. రెండు కోట్ల మందికి బీజేపీ ఉద్యోగాలు ఇస్తానంటూ మోసం చేసిందన్నాకు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 33 జిల్లాలు ఏర్పాటు చేశారని, ఒక్క జిల్లాలో అయినా ఉద్యోగాలు భర్తీ చేశారా? అని షర్మిల నిలదీశారు. నిరుద్యోగులను బాగు చేద్దామనే ఆలోచన ఎవరికీ లేదని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ గురించి అయితే నేను మాట్లాడను.. కోవిడ్ పూర్తయిన తర్వాత మళ్ళీ పాదయాత్ర చేస్తాను అని చెప్పారు షర్మిల. ముందస్తు ఎన్నికలు వస్తే మాత్రం మాకే మంచిదని కేసీఆర్ త్వరగా దిగిపోతారని అన్నారు షర్మిల. పార్టీ రిజిస్ట్రేషన్ గురించి ఎన్నికల కమిషన్‌కి అప్లికేషన్ పెట్టుకున్నామని, తన తల్లి విజయమ్మ కూడా  నో అబ్జక్షన్ సర్టికేట్ లెటర్ ఇచ్చారని తెలిపారు. కానీ ఇంతవరకు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయలేదో ఎన్నికల కమిషన్‌కే తెలియాలని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: