
అద్దంకిలో వైసిపి ఆవిర్భావం తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా గొట్టిపాటి రవికుమార్ విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీకి జై కొట్టారు. దీంతో అదే నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత బాచిన చెంచు గరటయ్యకు 2019లో అవకాశం ఇచ్చారు జగన్. ఆ తర్వాత ఆయన కుమారుడు బాచిన కృష్ణ చైతన్యకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. వైసీపీ అయితే చైతన్యకు కేడర్ లో మంచి మార్కులు పడకపోవడం నియోజకవర్గంలో గ్రూపులు తయారయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గానికి చెందిన పాణెం చినహానిమిరెడ్డిని 2024 ఎన్నికల్లో పోటీకి దింపింది. వైసిపి.
అయితే ఆయన కూడా అక్కడ గెలవలేకపోయారు. తాజాగా పిడుగురాళ్లకు చెందిన చింతలపూడి అశోక్ కుమార్ కు అవకాశం ఇచ్చారు జగన్. దీంతో ఆ నియోజకవర్గ వైసిపిలో ఐదే కృష్ణుడు ఎంట్రీ ఇచ్చినట్లయింది. అయితే అద్దంకి బాధ్యతలు సీనియర్ నేత కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేశ్ కు ఇస్తారని .. ఫైనల్‌గా 2029 ఎన్నికల వేళ కరణం వెంకటేశే ఇక్కడ క్యాండెడ్ అవుతారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో ? చూడాలి.