ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్లో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంత అద్భుతమైన ప్రదర్శన చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి వన్డే మ్యాచ్ లో సెంచరీ చేసి అదరగొట్టిన విరాట్ కోహ్లీ ఇక మూడో వన్డే మ్యాచ్లో కూడా 166 పరుగులతో విరోచితమైన పోరాటం చేశాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ సెంచరీ లతో అటు భారీ స్కోరు నమోదు చేసిన జట్టు  వరుస విజయాలు అందుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే శ్రీలంకను మూడు మ్యాచ్లలో కూడా ఓడించి 3-0 తేడాతో క్లీన్స్వీస్ చేసింది టీమిండియా జట్టు.


 అయితే ఇక ఇలా మూడు మ్యాచ్లలో రెండు సెంచరీలతో చెలరేగిపోయిన విరాట్ కోహ్లీకి అటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే సరైన ఆటగాడికే మ్యాన్ అఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది అంటూ ఎంతో మంది మాజీ ఆటగాళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ గంభీర్ మాత్రం విరాట్ కోహ్లీకి మ్యాన్ అఫ్ ది సిరీస్ ఇవ్వడం గురించి స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు అని చెప్పాలి.. శ్రీలంకలో జరిగిన వన్డే సిరీస్ లో బౌలింగ్లో సత్తా చాటిన మహమ్మద్ సిరాజ్ కు విరాట్ కోహ్లీకి కలిసి సంయుక్తంగా మ్యాన్ అఫ్ ది సిరీస్ అవార్డు ప్రకటించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.


 కోహ్లీకి ఒక్కడికే మ్యాన్ అఫ్ ది సిరీస్ ఇవ్వడం కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే మహమ్మద్ సిరాజ్ సైతం ఇక విరాట్ కోహ్లీ తో సమానంగానే రాణించాడు అని నేను అనుకుంటున్నాను. అందుకే ఇక ఇద్దరికీ కలిసి సంయుక్తంగా మ్యాన్ అఫ్ ది సిరీస్ అవార్డును అందజేసి ఉంటే బాగుండేది అంటూ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. సిరాజ్ ఎంత అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ పెద్ద సెంచరీలు చేసే బ్యాటర్ల వైపే మనం మొగ్గు చూపుతామని తెలుసు. కానీ వన్డే సిరీస్ లో మాత్రం సిరాజ్ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు అనడంలో అతిశయోక్తి లేదు అంటూ గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ సిరీస్ లో మొత్తం తొమ్మిది వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్ గా సిరాజ్ ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: