పుష్ప2 సినిమాలోని గంగమ్మ తల్లి జాతరలో యాట తల నరికినట్టు రప్పా రప్పా నరుకుతా అనే డైలాగు అల్లు అర్జున్ చెప్పడంతో ఈ డైలాగ్ వైరల్ గా మారింది. అంతేకాకుండా పొలిటికల్ పరంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సభలలో ఈ డైలాగులు ఫ్లెక్సీలు పట్టుకోవడంతో మరింత పాపులారిటీ అందుకుంది. ఈ డైలాగుని మాజీ సీఎం జగన్ కూడా ఎన్నోసార్లు చెప్పడంతో సోషల్ మీడియాలో మరింత ఎక్కువగా మారింది. ఇప్పుడు తాజాగా ఈ డైలాగు బుల్లితెర పైన కూడా వినిపిస్తోంది.


తాజాగా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో విడుదల చేయగా ఇందులో యాక్టర్ అన్నపూర్ణమ్మ, వై విజయ స్కిట్ లో భాగంగా వచ్చారు. ముఖ్యంగా నూకరాజు చేసిన స్కిట్లో వీరిద్దరూ హైలెట్గా నిలిచారు. వచ్చి రావడంతోనే తమ పంచులతో అందరినీ కడుపుబ్బ నవ్వించారు. వీరి పంచు డైలాగులకు జడ్జిగా ఉన్న ఖుష్బూ, కృష్ణ భగవాన్ వీరి కామెడీతో ప్రోమో ని హైలెట్ చేశారు. ముఖ్యంగా వై విజయ చొప్పేటువంటి ఖూష్బూ మీద పంచు డైలాగ్ హైలైట్ గా నిలిచింది.


స్కిట్ లో భాగంగా నూకరాజు ఒక బస్తా మల్లెపూలు పట్టుకొని మరి తన భార్య దగ్గరికి వస్తారు... అయితే అప్పటికే ఆషాడం మాసం మొదలైందని కొత్త జంట దూరంగా ఉండాలని అటు అన్నపూర్ణమ్మ, వై విజయ చెబుతారు. ఆ తర్వాత తన పెళ్ళాం దగ్గర కూర్చొని మరి నూకరాజు మూడు నెలల తిరగకముందే నీకు పులుపు తినిపిస్తా అంటూ డైలాగ్ చెప్పడంతో.. ఈ డైలాగు విన్న తర్వాత అన్నపూర్ణమ్మ గడ్డి పీకలేనోడు దొడ్లో ఆవిడకెళ్ళి రప్పా రప్పా అని చెట్టు నరుకుతాడంట అంటూ కౌంటర్ వేసింది. ఈ డైలాగులతో మొత్తం సెట్ లో అందరూ నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించి ప్రోమో కూడా వైరల్ గా మారుతోంది. మొత్తానికి జబర్దస్త్ స్కిట్ లో కూడా రప్పా రప్పా డైలాగ్ వచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: