జాబ్ అంటే చాలా మందికి బోర్..ఎప్పుడూ వర్క్ మీద కుస్తీ పట్టడం..బాస్ చెప్పిన పనులు చెయ్యడం..ఒక మెషిన్ లాగా నేలంతా కష్టపడి..చివరికి నెల జీతం తీసుకోవడం చేస్తారు.అలా చెయ్యడం కొంతమందికి నచ్చదు.చాలా సింపుల్ గా ఉండి కేవలం తిని నిద్ర పోతే బాగుండు అని చాలా మంది అనుకుంటారు.అలాంటి వారి కోసమే ఈ జాబ్..ఎప్పుడూ తింటూ ఉంటూ ఏడాదికి 62 లక్షలను పొందవచ్చు.. వావ్ ఇది నిజంగా సూపర్ కదా.. ఆ జాబ్ పూర్తీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


ఒక అమెరికన్ క్యాండీ రిటైలర్ ఒక ప్రత్యేకమైన ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తోంది. సంవత్సరానికి సుమారు రూ.62 లక్షలు ఇందుకు జీతంగా సదరు సంస్థ అందిచనుంది.చీఫ్ క్యాండీ ఆఫీసర్ ఉద్యోగానికి.. ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర అమెరికాలో అతిపెద్ద ఆన్‌లైన్ మిఠాయి రిటైలర్, క్యాండీ ఫన్‌హౌస్ వెల్లడించింది..
కంపెనీ హెడ్ టేస్ట్-టెస్టర్ గా ఎంపికైన వ్యక్తి అదృష్టవంతుడు.



అతడు "కాండియాలజిస్టుల" బృందానికి నాయకత్వం వహిస్తాడు. ఉద్యోగ నియామకం ప్రకారం.. నియమితులైన వ్యక్తి కంపెనీ బోర్డు సమావేశాలను కూడా నిర్వహించాలి. కానీ ముఖ్యంగా.. అతను లేదా ఆమె మిఠాయిల పట్ల నిజమైన అభిరుచిని కలిగి ఉండాలి. క్యాండీల పట్ల రుచికి వయస్సుతో సంబంధం లేదని.. అందుకే కంపెనీ ఐదు లేదా అంతకంటే ఎక్కువ వయస్సులో ఎవ్వరినైనా నియమించుకుంటున్నట్లు CEO, జమాల్ హెజాజీ.. కంపెనీ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఉద్యోగ ప్రకటనలో పేర్కొంది..ఉత్తర అమెరికా నుంచి జాబ్ రోల్ పై ఆసక్తి ఉన్న ఎవరైనా ఆగస్టు 31లోపు కంపెనీ వెబ్‌సైట్‌లో దరఖాస్తును సమర్పించాలి. అధికారిక కంపెనీ జాబ్ వెబ్‌సైట్ లో పిల్లల తరఫున వారి తల్లిదండ్రులు కూడా దరఖాస్తు చేయవచ్చు. ఇందుకోసం.. https://candyfunhouse.ca/pages/careers కి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు. టొరంటో లేదా న్యూజెర్సీలోని నెవార్క్‌లోని క్యాండీ ఫన్‌హౌస్ ప్రధాన కార్యాలయంలో పని చేసేందుకు వీలు ఉంటుంది.. మీరు సమీపంలో ఉంటే మీరు కూడా జాబ్ కోసం ట్రై చెయ్యండి.


మరింత సమాచారం తెలుసుకోండి: