ఇండియాలో మారుతీ సుజుకీ కార్లకు మంచి గుర్తింపు ఉంది. అయితే మార్కెట్లోకి విడుదల చేసిన మారుతి సుజుకి విటారా బ్రెజా కారు అమ్మకాల్లో దూసుకుపోతోంది.  ఇక ఇండియాలో అత్యధికంగా అమ్ముడు పోయిన కార్లు ఇవే. నాలుగున్నర సంవత్సరాల్లోనే 5.5 లక్షల యూనిట్లు అమ్ముపోయినట్లు ఆ సంస్థ ప్రకటించింది. దీన్ని 2016లో మార్కెట్లోకి విడుదల చేశారు. ఇక 2020 ఆటో ఎక్స్ పోలో మారుతి సుజుకి సరికొత్త విటారా బ్రెజా మోడల్ కారును విడుదల చేసింది కంపెనీ.

అయితే ఈ కారు కొత్త మోడల్ కారు 1.5 లీటర్ కె-సిరీస్, బిఎస్ 6 పెట్రోల్ ఇంజిన్ తో లభిస్తుందని తెలిపారు. ఇక డ్యుయల్ టోన్ రూఫ్, కొత్త ఎల్ఈడి హెడ్ల్యాంప్, డిఆర్ఎల్లను కొత్త మోడల్లో అభివృద్ధి చేశారని తెలిపారు. దీంట్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఫీచర్ ఉందని తెలిపారు. ఇది నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో పనిచేస్తుందని తెలిపారు. ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 18.76 కిమీ మైలేజీని అందిస్తుంది. మాన్యువల్ వేరియంట్ లీటరుకు 17.03 కిమీ మైలేజీని అందిస్తుంది. ఐడియల్ స్టాప్-స్టార్ట్ & టార్క్ అసిస్ట్ ఫంక్షన్, రీ జెనరేటివ్ బ్రేక్ ఎనర్జీ వంటి ఫీచర్లు దీనికి అదనపు బలం.

విటారా బ్రెజా కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో ఆధిపత్యం చెలాయించిందని చెప్పారు. శక్తివంతమైన పనితీరుతో ఈ ఎస్యూవీ ట్రెండ్ సెట్టర్గా మారిందని తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ అమ్మకాలు పొందిన బ్రెజాకు అప్డేటెడ్ వర్షన్ కారును విడుదల చేశామన్నారు. ఇక శక్తివంతమైన 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కారుకు డిజైన్ అప్ డేట్స్ వినియోగదారులను బాగా ఆకర్షించాయి. విటారా బ్రెజా 5.5 లక్షల అమ్మకాల మైలురాయి సంస్థ పనితీరును, నిబద్దతను తెలియజేస్తుంది. ఈ ఏడాది ప్రథమార్థంలో ప్రారంభించిన సరికొత్త అప్ డేటెడ్ విటారా బ్రెజా ఆరు నెలల్లోనే 32,000 యూనిట్లను విక్రయించిందని తెలిపారు. వీటి అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు సంస్థ యాజమాన్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: