ప్ర‌పంచంలోనే లగ్జరీ వాహన తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ మ‌న‌దేశంలో తన 6 సిరీస్ జిటి ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది. కొత్త బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ ఆరంభ ధర రూ. 67.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ లగ్జరీ-సెడాన్ డెలివరీలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్‌ను ఒక పెట్రోల్, రెండు డీజిల్‌తో సహా మొత్తం మూడు వేరియంట్లలో వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంచారు.

మూడుర‌కాలు.. మూడుధ‌ర‌ల్లో
బిఎమ్‌డబ్ల్యూ 630 ఐఎమ్ స్పోర్ట్ ధర రూ. 67.90 లక్షలు, 620 డి లగ్జరీ లైన్ ధర రూ .68.90 లక్షలు, 630 డిఎమ్ స్పోర్ట్స్‌ ధర రూ. 77.90 లక్షల వ‌ర‌కు ఉన్నాయి. బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి డిజైన్ బంపర్, కొత్త ఎల్-ఆకారపు డ్యూయల్ డిఆర్‌ఎల్, ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్స్,  వైడ్ కిడ్నీ గ్రిల్ ఉంది . వెన‌క‌ డ్యూయల్ కలర్ బంపర్,  3 డి ఎల్ఈడి టెయిల్ లాంప్ ఉంది. ఇందులో 12.3 అంగుళాల ట‌చ్ ‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో ‌సిస్టం,  లైవ్ కాక్‌పిట్, వర్చువల్ అసిస్టెంట్ ఉంది. ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్, రియర్ సీట్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్, 360 డిగ్రీస్ పార్కింగ్ కెమెరా, ఆటోమేటిక్ పార్కింగ్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ రియర్ సీట్, పనోరమిక్ సన్‌రూఫ్, ఎయిర్ సస్పెన్షన్ వంటివి కూడా ఇచ్చారు.

ఈఎంఐ రూ.69 వేలు
ఇంజన్ 3 ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 630 ఐ లో 2.0 లీటర్ ఇంజన్ ఉంది, ఇది 258 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 6.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు అందుకుంటుంది. 620 డి వేరియంట్ లో 2.0-లీటర్ ఇంజన్ ఉంది. ఇది 190 బిహెచ్‌పి పవర్, 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 7.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగం అందుకుంటుంది. అదే విధంగా 630 డి 3.0 లీటర్ ఇంజన్ 265 బిహెచ్‌పి మరియు 620 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఇది 6.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగం పుంజుకుంటుంది. రూ .69,999 ఇఎంఐతో కొనుగోలు చేసే సదుపాయాన్ని కల్పించ‌డం విశేషం. ఆల‌స్య‌మెందుకు.. మీరు కూడా ఓసారి లుక్కేయండి.. న‌చ్చితే కొనేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: