కళ్యాణ్ రామ్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందిన లక్ష్మీ కళ్యాణం మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత చందమామ మూవీ తో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మగధీర మూవీ తో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. మగధీర సినిమా తర్వాత ఈమెకు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కడం , అందులో చాలా వరకు విజయాలను సాధించడంతో ఈమె తన కెరియర్ లో ఎప్పుడూ వెనక్కు తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. కొన్ని రోజుల క్రితమే ఈ బ్యూటీ గౌతమ్ అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 

వారికి పండంటి బిడ్డ కూడా జన్మించింది. పెళ్లి , బిడ్డకు జన్మను ఇచ్చే క్రమంలో కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈమె ప్రస్తుతం మళ్లీ వరుస సినిమాలలో నటిస్తోంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈమె భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ బ్యూటీ సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ మే 31 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు.

మూవీ ట్రైలర్ ను మే 24 వ తేదీన విడుదల చేయనున్నట్లు. చిత్ర బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియోని విడుదల చేశారు. సత్యభామ మూవీ లో కాజల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఈమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడం , అలాగే ఇప్పటి వరకు ఈ చిత్ర బృందం వారు విడుదల చేసిన ప్రచార చిత్రాలు , పాటలు కూడా బాగుండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా జనాలను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: