ఈ మధ్యకాలంలో ఎక్కడ చుసిన దొంగల బెడదా కాస్త ఎక్కువైపోతుంది అన్న విషయం తెలిసిందే. తాళం వేసి ఉన్న ఇల్లు కనిపించాయి అంటే చాలు ఇక రహస్యంగా ఇంట్లోకి చొరబడి అందిన కాడికి దోచుకుపోతున్నారు. అయితే దొంగలు ఈ మధ్యకాలంలో చోరీలు చేయడానికి ఎప్పటికప్పుడు వినూత్నమైన ఆలోచన చేస్తున్నారు. సినిమాలు కాదు ఏకంగా సినిమాలకు మించిన క్రియేటివిటీని ఇలా చోరీలు చేయడంలో చూపిస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 అయితే కేవలం ఇంట్లో చొరబడి చోరీలు చేసే దొంగలు మాత్రమే కాదు.. ఇక రకరకాలుగా ఎంతో మంది చోరీలకు పాల్పడుతూ ఉండడం గమనార్హం. కొంతమంది రోడ్డు పక్కన నిలబడి మంచి వాళ్ళలా నటిస్తూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. ఇంకొంతమంది పార్క్ చేస్తూ ఉన్న వాహనాలను దొంగలిస్తూ చోరీ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఇలా ఎన్నో రకాల దొంగలను చూసాం. కానీ ఇక్కడ మాత్రం మనం మాట్లాడుకునేది వెరైటీ దొంగ. సాధారణంగా దొంగలు పడితే పోలీసులు వచ్చి రక్షణ కల్పిస్తారు. ఇక నేరస్తులను పట్టుకుని దోచుకు వెళ్ళింది మొత్తం రికవరీ చేసి బాధితులకు అప్పగిస్తారు.


 కానీ ఇక్కడ మాత్రం కాస్త డిఫరెంట్. ఏకంగా దొంగలను పట్టుకోవాల్సిన పోలీస్ బండే చోరీకి గురైంది. తమిళనాడులో ఈ విచిత్రకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. రామనాథ పురానికి చెందిన సంతోష్ మద్యం మత్తులో  ఓ కానిస్టేబుల్ బైక్ దొంగలించి నేరుగా సీఎం ఇంటికి వెళ్ళాడు. అల్వార్ పేటలోని సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లి రచ్చ చేశాడు. అయితే సీఎం నివాసం వద్ద పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. ఇక వాహనానికి పోలీసు స్టిక్కర్ చూసి ఆరా తీయడంతో బైక్ దొంగలించినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు. అయితే రాష్ట్ర యువత మద్యం బానిసలు కాకుండా చర్యలు తీసుకోవాలని కోరేందుకే తాను సీఎం స్టాలిన్ ఇంటికి వచ్చినట్లు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: