ఉత్తర్ ప్రదేశ్ లో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం మరోసారి వెలుగుచూసింది. మరో సామాన్యుడికి కరెంటు శాఖ వారి షాక్ తగిలింది. సాయంత్రం వేళ ఓ లైటు వెలుగులో వ్యాపారం చేసుకునే నూడుల్స్ బండి యజమాని ఖంగు తినేలా.. ఏకంగా రూ. 1.82 కోట్లు కరెంటు బిల్లు వచ్చింది.మేరట్ ఆషియానా కాలనీకి చెందిన ఆస్ మహ్మద్ ఖాన్.. నూడుల్స్ వ్యాపారం చేస్తుంటాడు. సాధారణంగా వెయ్యి, రెండు వేలు వచ్చే కరెంటు బిల్లు.. ఈ సారి కోట్లల్లో వచ్చే సరికి షాక్ అయ్యాడు.


ఖాన్ ఒక్కడికే కాదు.. ఈ మధ్యకాలంలో యూపీ విద్యుత్ శాఖ షాకుల మీద షాకులిస్తుంది. వినియోగంతో సంబంధం లేని బిల్లులు చేతికిచ్చి జనం నిర్ఘాంతపోయేలా చేస్తోంది. హర్పూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఏకంగా రూ. 1,28,45,95,444 బిల్లు అంటగట్టారు. మధ్యప్రదేశ్, సత్నా జిల్లాలో ఓ పనిమనిషి ఇంటి కరెంటు బిల్లు అక్షరాలా రూ. 1.25 లక్షలు.

మరింత సమాచారం తెలుసుకోండి: