అత్యంత భయంకరమైన చర్మ సమస్య ఏంటంటే ముఖంపై మొటిమలు రావడం. నిజానికి దీనికి మించిన చర్మ సమస్య ఇంకోటి ఉండదు. ఈ సమస్య ఒక్కసారి వచ్చిందంటే 30, 40 సంవత్సరాల దాకా పోదు. అంతలా ఈ సమస్య మనల్ని వేధిస్తుంది.అయితే ఇప్పుడు చెప్పే చిట్కాలు రోజు పాటిస్తే ఖచ్చితంగా మీకు మంచి ఫలితం ఉంటుంది. ఆ టిప్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


టొమాటో మచ్చలను తొలగించడానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. టొమాటో రసాన్ని మన ముఖానికి రాసుకుంటే మొటిమల మచ్చలు తగ్గడమే కాకుండా చర్మం కాంతివంతంగా మారుతుంది. టొమాటోను కట్ చేసి, ముఖానికి నెమ్మదిగా రుద్దాలి. ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.మొటిమను ఎప్పుడూ చేతులతో గిల్లకూడదు. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి కానీ వాటి తాలూకు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు కొన్ని వారాల పాటు అలాగే ఉంటాయి. అప్పుడు ఆ మచ్చలను తొలగించడానికి మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవల్సి వస్తుంది.


చర్మాన్ని శుభ్రంగా ఉంచడానికి, డల్ స్కిన్‌ను ప్రకాశవంతంగా మార్చడానికి రసాయన ఉత్పత్తులకు బదులుగా సాధారణ ముల్తానీ మట్టిని ఉపయోగించవచ్చు. ఇంట్లో చందనం ఉంటే మరీ మంచిది. రాత్రి పడుకునే ముందు మొటిమల ప్రభావిత ప్రాంతాల్లో గంధాన్ని పూసుకుని నిద్రపోవాలి. ఉదయాన్నే నిద్రలేచాక కడిగేయాలి. ఇలా చేస్తే ఒక్క రాత్రిలోనే మొటిమలన్నీ మాయమైపోవడాన్ని మీరు చూస్తారు.మీ ముఖంపై మొటిమలు వస్తే వాటి నుంచి ఉపశమనం పొందడానికి కనీసం వారం రోజులు పడుతుందని అందరూ అనుకుంటుంటారు. కానీ రాత్రికిరాత్రే వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు. అందుకు ఇంట్లోనే ఈ టిప్స్‌ ఫాలో అయితే సరి. ఫలితంగా, మొటిమలు ఒక్క రాత్రిలోనే మాయమవుతాయి. కొద్దిగా పండిన బొప్పాయిని రాత్రి పడుకునే ముందు మొటిమలపై రాస్తే ఉదయానికి మొటిమలు మాయమవుతాయి.కాబట్టి ఖచ్చితంగా పైన తెలిపిన టిప్స్ పాటించండి. ముఖంపై మొటిమల్ని చాలా ఈజీగా తగ్గించుకోండి. మీ అందాన్ని పెంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: