మనం రోజూ వాడే రూ.10 కాయిన్ ను ఎప్పుడైనా పరిశీలనగా చూశారా, ఎందుకంటే అదో స్పెషల్ కాయిన్. రెండు రంగుల్లో ఉంటుంది. ఐతే, అప్పుడప్పుడూ ఈ కాయిన్ విషయంలో జనాలకు కొన్ని డౌట్స్ వస్తుంటాయి, కొన్ని పుకార్లు కూడా షికార్లు చేస్తుంటాయి. అసలు దీని కథేంటి? దీన్ని ఎలా తయారు చేస్తారు? దీని ఖర్చు ఎంత? ఇది చెల్లుతుందా, లేదా? అనే విషయాలు సింపుల్‌గా, సూటిగా తెలుసుకుందాం.

డిజైన్, మెటీరియల్ విషయానికొస్తే, ఈ రూ.10 కాయిన్‌ని రెండు వేర్వేరు లోహాలతో తయారు చేస్తారు. అందుకే అది రెండు రంగుల్లో మనకు కనిపిస్తుంది.

బయట రింగ్ ను 'అల్యూమినియం బ్రాంజ్' అనే లోహంతో చేస్తారు. దీని బరువు 4.45 గ్రాములు. మధ్య భాగాన్ని 'క్యూప్రో-నికెల్' అనే లోహంతో చేస్తారు. దీని బరువు 3.26 గ్రాములు. అంటే, మొత్తం కాయిన్ బరువు 7.71 గ్రాములు అన్నమాట.

కాయిన్ తయారీ ఖర్చు విషయానికి వస్తే... ఒక రూ.10 నాణేన్ని తయారు చేయడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా, అక్షరాలా రూ.5.54 పైసలు. అవును, ఈ విషయాన్ని మన హైదరాబాద్ మింట్ వాళ్లే అధికారికంగా చెప్పారు. ఇందులో మెటల్ ఖరీదు, తయారీ ఛార్జీలు అన్నీ కలిపి ఉంటాయి. అంటే, కాయిన్ విలువలో సగానికి పైగా ఖర్చు దాని తయారీకే అవుతుందన్నమాట. అయినా సరే, మార్కెట్లో కరెన్సీ చలామణి (Currency Circulation) సజావుగా సాగాలి కాబట్టి ప్రభుత్వం వీటిని తయారు చేస్తూనే ఉంది.

ఈ రూ.10 కాయిన్ల విషయంలో పెద్ద గందరగోళమే నడిచింది గతంలో. కొన్ని కాయిన్లు దొంగవి అని, అవి చెల్లవని పుకార్లు షికార్లు చేశాయి. ఎందుకంటే, మార్కెట్లో ఏకంగా 14 రకాల రూ.10 కాయిన్ డిజైన్లు ఉన్నాయి. కొన్నింటిపై ₹ గుర్తు ఉంటుంది, కొన్నింటిపై ఉండదు. కొన్నింటిపై గీతలు ఎక్కువ ఉంటే, కొన్నింటిపై తక్కువ ఉంటాయి. దీంతో జనాలు కన్‌ఫ్యూజ్ అయ్యారు.

అప్పుడే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రంగంలోకి దిగింది. "అయ్యా, మీరు చూస్తున్న 14 రకాల రూ.10 నాణేలు.. అన్నీ అసలైనవే, అన్నీ చట్టబద్ధంగా చెల్లుతాయి. డిజైన్ వేరేగా ఉందని కంగారు పడకండి, మొహమాటం లేకుండా తీసుకోండి, వాడండి" అని RBI ఫుల్ క్లారిటీ ఇచ్చింది. కాబట్టి, రూ.10 నాణెం మన అధికారిక భారతీయ కరెన్సీ. దాని తయారీకి రూ.5.54 ఖర్చయినా, దాని విలువ రూ.10. మార్కెట్లో మీకు ఏ డిజైన్‌లో కనిపించినా సరే, అదో ఒరిజినల్ కాయిన్. ధైర్యంగా రోజువారీ అవసరాలకు వాడుకోవచ్చు, తీసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: