ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా దొంగల బెడద ఎక్కువైపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా దొంగలు ఏదో ఒక విధంగా జనాల్ని బురిడీ కొట్టించి దొంగతనాలకు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో అయితే దొంగల తీరులో చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడుకేవలం  ఇళ్లలో మాత్రమే దొంగతనాలకు పాల్పడే వారు. కానీ ఇప్పుడు మాత్రం ఇళ్లలో మాత్రమే కాదు ఎక్కడ దొరికితే అక్కడ దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. అంతే కాకుండా ఎలాంటి సాక్ష్యాలు దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు దొంగలు. ఇక్కడ దొంగలు కాస్త తెలివిగా ఆలోచించారు. ఏకంగా ఒక వైపు పెళ్లి జరుగుతుంటే మరోవైపు చోరీ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. సాధారణంగా సినిమాల్లో చూస్తూ ఉంటా దొంగలు పెళ్లి లోకి వెళ్లి ఇక బంగారు ఆభరణాలను చోరీ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. రాజస్థాన్ లో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగిన పెళ్లి వేడుకలో ఒక భారీ చోరీ జరిగింది. ఏకంగా రెండు కోట్ల విలువైన వజ్రాలతో కూడిన నగలతో పాటు 95 వేల రూపాయల నగదు కూడా అపహరణకు గురైంది. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


 ముంబైకి చెందిన వ్యాపారి రాహుల్ భాటియా తన కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలి అని అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఏకంగా ఒక ఫైవ్ స్టార్ హోటల్ బుక్ చేస్తాడు. అయితే ఇక పెళ్లి ఘనంగా జరుగుతూ ఉండడంతో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరూ వచ్చి ఫైవ్ స్టార్ హోటల్లో బస చేశారు. హోటల్ లో ఏడో అంతస్థులో ఇలా కుటుంబ సభ్యులు బంధువులు బస చేశారు. హోటల్ ప్రాంగణంలో పెళ్లి వేడుకకు వెళ్లే సమయంలో చోరీ జరిగింది. తిరిగి వచ్చేసరికి బంగారు ఆభరణాలు నగదు కనిపించడం లేదని  అందరూ షాక్ అయ్యారు. అయితే హోటల్ సిబ్బంది సహకారంతో ఈ సంఘటన జరిగి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తూ సదరు వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: