పాక్ కు మద్దతు ఇస్తోంది ఎవరు  ?

యావత్ ప్రపంచం దృష్టి ఐక్యరాజ్య సమితి (యు.ఎన్.ఓ సమావేశాల పైనే ఉంది. ఏఏ దేశాధి నేతలు ఎవరితో సమావేశం అవుతున్నారు. ఏం చర్చిస్తున్నారు అన్న విషయం పై అందరూ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. ప్రతి అంశాన్ని తమ కెమెరాలలో బంధించేందుకు  వేలాది మంది పాత్రికేయులు ఐరాస కార్యాలయం వద్ద కునుకు లేకుండా గడుపుతున్నారు.
పాకిస్తాన్ కు మిత్రదేశాల జాబితాలో ఇటీవలి సంవత్సరాలలో చేరిన టర్కీ ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశాలను వేదికగా చేసుకుంది. దక్షిణ ఆసియా దేశాల్లో పరపతి  పెంచుకోవాలని చూస్తున్న టర్కీ  తొలుత పాకిస్తాన్ కు స్నేహహస్తం అందించింది. నింపాదిగా  అంతర్జాతీయ వేదికలపై తనదైన మార్కును ప్రదర్శిస్తోంది.  టర్కీ గతంలో కాశ్మీర్ సమస్యలో నేరుగా తలదూర్చి పలుదేశాల నుంచి నిరసనను ఎదుర్కొన్నది. నిరుటి సంవత్సరం ఐరాస సమావేశాలు వర్చువల్ విధానంలో జరిగాయి. అప్పుడు కూడా ఆ దేశం తన వ్యవహార శైలిని మార్చుకోలేదు. టర్కీ అధ్యక్షుడు ఎర్టోగన్ కు భారత విదేశాంగ మంత్రి జైశంకర్  గట్టిగా సమాధానం ఇచ్చారు. భారత దేశం ఆంతరంగిక విషయాల్లో తలదూర్చవద్దని హెచ్చరించారు. ఏ దేశమైనా తమ అంతర్గత  విషయాల్లో జోక్యం చేసుకుంటే సహించదన్న కనీస పరిజ్ఞానం లేక పోవడం  లేకపోవడం ఏమిటని భారతదేశం టర్కీని ప్రశ్నించింది.
టర్కీ అధ్యక్షుడు ఎర్టోగన్ తన వ్యవహార శైలిని మార్చుకోలేదు.  ఐక్యరాజ్య సమితి తాజా సమావేశాల్లోనూ తన మిత్ర దేశం పాకిస్తాన్ కు వత్తాసు పలికారు.  ఈ దఫా నేరుగా కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. డెబ్బై ఏళ్లకు పైగా కాశ్మీర్ సమస్య పరిష్కారం కాకుండా ఉందన్నారు. దీనిని పరిష్కరించేందుకు ఐరాస చొరవ చూపాలని కోరారు. రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం  చేయాలని సూచించారు.  తమ దేశం కూడా ఈ చర్చల్లో పాల్గోనేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు కూడా ప్రకటంచారు. అంతటితో ఆగక పౌర సవరణ చట్టం పై విర్శలు చేశారు.
టర్కీ అద్యక్షుడు సంభాషిస్తున్న సమయంలోనే  సభకు హాజరైన వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక దేశం లోని  చట్టాలను మరొక దేశం విమర్శించ కూడదని అమెరికా దేశ ప్రతి నిధులు  తీవ్ర అభ్యంతరం  తెలిపారు. భారత దేశం టర్కీ అధ్యక్షుడు ఎర్టోగన్  ప్రసంగం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్ జోలికి రావద్దంటూ హెచ్చరించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: