మనం ఏ పని చేయాలన్నా చిత్త శుద్ధి అవసరం. గతంలో కాంగ్రెస్‌కు 400 పైగా సీట్లు ఉన్నప్పుడు, 330 పై చిలుకు సీట్లు ఉన్న సందర్భంలో ఆర్టికల్ 370 రద్దు చేస్తామంటే వ్యతిరేకించే వారు ఎవరైనా ఉన్నారా. బీజేపీ కానీ, కమ్యూనిస్టులు వద్దనేవారా. శతాబ్దాల సమస్యను పరిష్కరించిన వారు అయ్యేవారు. దీంతో పాటు ప్రజల్లో సానుభూతి కూడా పెరిగేది. కానీ చేయలేదు.


అలాగే జీఎస్టీ. ఒకే దేశం ఒకే పన్ను. ఇది మోదీ సంస్కరణ కాదు. మా ప్రభుత్వ హయాంలోనే పురుడుపోసుకుంది అని కాంగ్రెస్ వాదించింది. దీనిని అప్పుడే అమలు చేసుంటే దేశంలో గొప్ప సంస్కరణ చేపట్టిన పార్టీలా చరిత్రలో నిలిచిపోయేది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు.  ఈ బిల్లుకు కాంగ్రెస్ హయాంలోనే రాజ్యసభలో ఆమోదం లభించినా బిల్లు కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఈ బిల్లు పెట్టగానే కాంగ్రెస్ సైతం మద్దతిచ్చింది. లేకుంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది కాబట్టి.


ఇవన్నీ కాంగ్రెస్ తమ ప్రభుత్వ హయాంలోనే చేసి ఉంటే దేశలో చారిత్రక బిల్లులు ప్రవేశపెట్టిన ఘనత ఆ పార్టీకే దక్కేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం మోదీకి వచ్చింది. సద్వినియోగం చేసుకున్నారు. చరిత్రలో నిలిచిపోతారు. స్వాతంత్ర్యం అనంతరం శతాబ్దాలకి పూర్వం ప్రారంభమైన చిక్కులు దశాబ్దాలుగా పరష్కరించబడని సమస్యలు చాలా ఉన్నాయి.  ఉదాహరణకు అయోధ్య రామాలయం తీసుకుంటే ఎన్నో ఏళ్లుగా కోర్టు తీర్పు రాలేదు. కారణం మత కల్లోహాలు జరుగుతాయని ప్రభుత్వమే కోర్టులపై ఒత్తిడి తెచ్చేది. అలా తీర్పులు ఆగిపోయేవి. ఇప్పుడు ఏమైంది. ప్రశాంతంగా అయోధ్య రామాలయ నిర్మాణం జరుగుతోంది.


మరోపక్క ఆర్టికల్ 370 రద్దు చేస్తే ముస్లింలే సంబరాలు జరుపుకున్నారని చెబుతున్నారు. ట్రిపుల్ తలాక్  గొడవలు జరుగుతాయని అన్నారు.  ఇలా భయపడి కాంగ్రెస్ హయాంలో చేయలేనివి అన్నీ ఇదే సభలో సులభంగా పరిష్కరించవచ్చు అని నిరూపించారు ప్రధాని మోదీ.

మరింత సమాచారం తెలుసుకోండి: