మగువలకు చక్కటి శుభవార్త.. నిన్న కాస్త తగ్గిన బంగారం ధరలు ఈరోజు ఇంకాస్త కిందకు దిగి వచ్చాయి. కొద్ది రోజులుగా నిలకడగా కొనసాగిన ధరలు నేటి మార్కెట్లో కిందకు దిగిరావడం గమనార్హం. గోల్డ్ కొనాలని భావించే వారికి శుభసూచకం.. పసిడి రేటు పడి పోతే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి రేటు భారీగా పతనమైంది. బంగారం ధర తగ్గడం ఇది వరుసగా రెండో రోజు.. మొత్తానికి మళ్లీ బంగారం ధరలు కిందకు దిగిరావడం తో మహిళలు కొనుగోళ్ల లో వేగం పెంచారు.


ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం ధరలు పడిపోయాయి. హైదరాబాద్ మార్కెట్ ‌లో మంగళవారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.200 క్షీణించింది. దీంతో రేటు రూ.45,880కు పడిపోయింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.190 క్షీణతతో రూ.42,050కు  చేరింది. బంగారం తగ్గితే .. వెండి కూడా అదే దారిలో నడిచింది.. భారీగా తగ్గింది.


ఈరోజు వెండి ధరల ను ఒకసారి పరిశీలిస్తే.. వెండి ధర భారీగా పతనమైంది. ఏకంగా రూ.1,800 తగ్గుదల తో రూ.70,000కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీ దారుల నుంచి డిమాండ్ తగ్గడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు..  విదేశీ మార్కెట్లో ఈ ధరలను చూస్తే.. బంగారం ధర పడిపోయింది. బంగారం ధర ఔన్స్ ‌కు 0.23 శాతం తగ్గుదల తో 1734 డాలర్ల కు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.24 శాతం క్షీణత తో 25.70 డాలర్లకు వచ్చింది. బంగారం ధర ల పై ఎన్ని విధాలుగా ప్రభావం పడుతున్నా కూడా ఇప్పుడు తగ్గడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: