కరోనా వైరస్ దేశం మొత్తం ఆర్థిక పరిస్థితిని దెబ్బ తీసింది. దీని దెబ్బకు పేద మధ్యతరగతి ప్రజలు అంతా చిన్నాభిన్నం అయిపోయారు. కనీసం తిందామంటే తిండి లేని పరిస్థితి కి చాలామంది వచ్చారు. ఉపాధి ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఎంతో మంది చనిపోయి  వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ కరోణ విజృంభిస్తున్న తరుణంలోనే  భారత్లోకి  అనేక వ్యాక్సిన్లు కూడా వచ్చాయి. ఇందులో కొన్ని వ్యాక్సిన్లు పని చేస్తున్నప్పటికీ దాని వేవ్ ను తట్టుకొని పని చేసే అంత శక్తి వాటికి లేకుండా పోతుంది అని చెప్పవచ్చు. ఈ వ్యాక్సిన్ అన్నింటిలో ఒక వ్యాక్సిన్ భారత్ బయోటెక్ విడుదల చేసిన కో వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ విడుదల నుంచి ఏదో ఒక తప్పిదం జరుగుతూనే ఉంది.

భారత్ బయోటెక్ చెందినటువంటి కో వ్యాక్సిన్ దాని యొక్క క్లినికల్ పరీక్షలను బ్రెజిల్ దేశంలో  రద్దు చేస్తున్నట్లు  ఆ దేశ ఆరోగ్య వ్యవహారాల నియంత్రణాధికారి ప్రకటించారు. బ్రెజిల్  దేశం మార్కెట్ లోకి వ్యాక్సిన్ తీసుకొచ్చేందుకు అక్కడి దేశ ప్రెసిక మెడికమేంటోస్, ఎన్విగ్జా ఫార్మా కంపెనీలతో ఎల్ ఎల్ సి తో చేసుకున్న అవగాహన ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్టు భారత్ బయోటెక్ ప్రకటించింది. బ్రెజిల్ దేశానికి ఈ సంవత్సరం 2,3 త్రైమాసికలలో  రెండు కోట్ల డోసుల వ్యాక్సిన్ టీకాలు సరఫరా చేసే ఒప్పందంలో ఎక్కువ స్థాయిలో అవినీతి చోటు చేసుకుందని  వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ ఎంవోయూ రద్దయింది. టీకాల సరఫరాలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఆ దేశ సేనాట్ దర్యాప్తుకు ఆదేశించిన ది.

ఒప్పందం రద్దుపై బ్రెజిల్ జాతీయ ఆరోగ్య నియంత్రణ భారత్ బయోటెక్ ఒక లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో క్లినికల్ ట్రయల్స్ రద్దు చేశారు. అయితే అనుమతి పత్రాల సమర్పణలో, స్థానిక తోడ్పాటు, లైసెన్స్, ఇన్సూరెన్స్, మూడవ దశ క్లినికల్స్ పరీక్షలు తదితర బాధ్యతలను మెడికమేంటోస్ చూసుకునేది. కానీ ఇంతవరకు బ్రెజిల్ దేశంలో కో వాక్సిన్  పరీక్షలు చేయలేదు.  దీంతో బ్రెజిల్ దేశంలో కో వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను అదే ఆరోగ్య నియంత్రణ రద్దు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: