గుండెపోటు.. ఇటీవల కాలంలో ఈ పేరు వినిపించింది అంటే చాలు ప్రతి మనిషి వనికి పోతున్నాడు అని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు గుండెపోటు వచ్చినప్పటికీ సరైన సమయంలో ఆసుపత్రికి వెళ్తే ఇక ప్రాణాపాయం ఉండేది కాదు అని అందరూ నమ్మేవారు. కానీ ఇటీవల కాలంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడం ఇక అప్రమత్తం అయ్యేలోపే నిమిషాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోతూ ఉండడం లాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇక కూర్చున్న చోటే క్షణాల వ్యవదిలో  ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయ్.


 వెరసి నేటి రోజుల్లో గుండెపోటు అనే పదం వినిపించింది అంటే చాలు ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుడుతుంది అని చెప్పాలి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించిన వారు ప్రతి రోజు వ్యాయామం చేసేవారు కూడా ఇక ఇలా గుండెపోటు కారణంగా మరణిస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిలో ప్రాణ తీపిని పెంచేస్తూ ఉన్నాయి. అయితే కొన్ని కొన్ని సార్లు ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ గుండెపోటుకు గురైన వారికి సిపిఆర్ నిర్వహించి ఇక ప్రాణాలను కాపాడటం లాంటివి కూడా చేస్తున్నారు. చండీగఢ్లో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.


 అయితే ఇక చుట్టుపక్కల వాళ్ళు గమనించే సరికి అతనిలో చలనం లేదు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి యష్పాల్ గార్గ్ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. హార్ట్ ఎటాక్ వచ్చి చలనం లేకుండా పడిపోయిన ఒక వ్యక్తికి సిపిఆర్ నిర్వహించారు. దీంతో ఆయన ఎంతో కష్టపడిన తర్వాత చివరికి ప్రాణం పోయింది అనుకున్న వ్యక్తి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇది చూసిన నెటిజెన్స్ షాక్ అవుతున్నారు. నిజంగా దేవుడిలా వచ్చి ప్రాణం కాపాడాడు అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: