విశ్వనటుడు కమల్ హసన్ ప్రయోగాల గని అంటారు.. సినీ పరిశ్రమలో ఈయన చేయని ప్రయోగాలు లేవు. ఏ పాత్రలో అయినా లీనమైన ఆ పాత్రకు జీవం పోస్తారు.  పొట్టివాడిగా నటించినా.. ముసలి వాడిగా నటించి... అమాయకుడిగా నటించినా.. ఏ పాత్రలో అయినా ఆయన ప్రత్యేకత కనిపిస్తుంది.  ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ మూవీలో నటిస్తున్నారు.  కెరీర్ బిగినింగ్ లో కమల్ హాసన్ వాణి గణపతి అనే ఆమెను వివాహం చేసుకున్నారు. కొంత కాలం తర్వాత ఆమెను నుంచి విడిపోయి సారికతో తన జీవితాన్ని పంచుకున్నాడు. వీరికి శృతి, అక్షర అను ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆ తర్వాత సారిక నుండి విడిపోయాడు.   ప్రముఖ తెలుగు నటి గౌతమితో పదమూడేళ్ల పాటు సహజీవనం సాగించాడు.. ఆ మద్య విడిపోయారు. అయితే కమల్, సారిక ల పెద్ద కూతురు శృతి హాసన్ హీరోయిన్ గా మంచి కెరీర్ కొనసాగించారు.  

 

ఆ మద్య కొన్ని కారణాల వల్ల సినీ రంగానికి దురమైనా.. ఇప్పుడు  రవితేజ సరసన ‘క్రాక్’ మూవీలో నటిస్తుంది.  తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తల్లిదండ్రులపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ జంటల మధ్య విభేదాలు రావడం, విడిపోవడం వంటి అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంది. అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు కలిసి ఉండడం కంటే విడిపోవడమే మంచిదని‌ అంటోంది. తన చిన్ననాడే.. అమ్మ, నాన్న విడిపోవడం సంతోషకరమైన విషయమేనని వ్యాఖ్యానించింది.

 

ఎందుకంటే తన పేరెంట్స్‌ ఇద్దరూ కళాకారులేనని, వారు పరస్పరం గొడవ పడుతూ మనశాంతి లేకుండా జీవించడం కంటే విడిపోవడమే మంచిదని తెలిపింది. వారిద్దరు విడిపోవడం కష్టంగా ఉన్నప్పటికీ వారు కలిసి జీవించినప్పుడు పలు సమస్యలు వచ్చేవని ఆమె తెలిపింది.  తాను వాటిని ప్రత్యక్షంగా చూశానని చెప్పింది. తాను మొదట్లో తన తల్లిదండ్రులను కలపాలని అనుకున్నానని తెలిపింది. కానీ వారు కలిసినా మళ్లీ మనశ్శాంతిగా ఉంటారన్న నమ్మకం లేక ఆ ప్రయత్నం మానుకున్నానని తెలిపింది. ప్రస్తుతం తన తల్లిదండ్రులు సంతోషంగానే ఉన్నారని తెలిపిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: