ఇటీవల తెలంగాణను షేక్ చేసిన ఘటన హేమంత్ కులోన్మాద హత్య.. కులం కోసం ప్రేమికులను పెద్దలు విడగోతున్నారు.ఇలాంటి ఘటనలు తెలంగాణలో చాలానే వెలుగు చూశాయి. మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు సంచలనంగా మారింది.. ఈ కేసును పూర్తిగా మరువక ముందే ఇప్పుడు హేమంత్ హత్య కేసు కలవర పెడుతుంది.తన కులం కాని వాడిని ప్రేమించిందనే కారణంతో ఆ ప్రేమజంటను విడదీయడం కుదరకపోతే అల్లుడని కూడా చూడకుండా క్రూరంగా చంపేయడం అమానుషం.. 



ఈ విషయం పై స్పందించిన సినీ నటి, బీజేపీ నేత మాధవి లత సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. మరో పరువు హత్య .. అమ్మాయి అదే కులం అబ్బాయిని పెళ్లి చేసుకొని ఉంటే చూపించండి నాకు..కులం పరువు, హోదా, డబ్బు, దర్పం మనుషులుగా మరణించిన మృగాలు. ఈ భూమి మీద ఇప్పటి రాజ్యాంగం ప్రకారం మేజర్ అయ్యాక ఎవరి హక్కులు వారివే.. కొడుకు వేరే కులం    అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తప్పు కాదు కానీ, అమ్మాయి చేసుకుంటే తప్పు వచ్చిందా అంటూ మాధవి ఫైర్ అయింది.



ఈ భూమ్మీద అమ్మా నాన్నలు ప్రేమించి నంతగా ఎవరూ ప్రేమించరు..అది నిజమే కానీ తనకు నచ్చిన వారిని పెళ్లి చేసుకోవడం అది వారి ఇష్టం..కానీ వాళ్ళను చంపే హక్కు మాత్రం ఎవరికి లేదు. అలా చేయాలనుకునే వాళ్లకు ఇంక కోర్టుకు ఎందుకు? ఈ పద్ధతులు, సిద్దాంతాలు ఎందుకు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు సరిపోద్ది..రాజ్యాంగాన్ని తీసుకెళ్లి తగల బెట్టండి అంటూ మండిపడ్డారు. గతంలో దళితుడిని చేసుకుందని ప్రణయ్ ని అతి దారుణంగా చంపేయించారు.ఇప్పుడు ఆర్య వైశ్యుడిని పెళ్లి చేసుకుందనే కోపంతో అవంతి భర్త హేమంత్‌ను చంపించాడు రెడ్డి కులస్థుడు లక్ష్మారెడ్డి. చనిపోయిన వాడి కుటుంబం ఏమైనా అవ్వని కానీ వీళ్లకు మాత్రం కులం కావాలి. అంటూ కుల రక్కసి పై కోపంతో రగిలి పోయింది. మాధవి లత అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: