యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . దేవదాస్ మూవీ తో హీరో గా వెండి తెరకు పరిచయం అయిన రామ్ పోతి నేని మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసు కుని అద్భుతమైన గుర్తింపు ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పాటు చేసుకున్నాడు . ఆ తర్వాత కూడా రామ్ పోతినేని ఎన్నో ప్రేమ కథా చిత్రా లలో హీరో గా నటించడం మాత్రమే కాకుండా , ఎన్నో మాస్ కథాంశాలతో తెరకెక్కిన మూవీ లలో కూడా హీరోగా నటించి ఇటు క్లాస్ ప్రేక్షకులను అటు మాస్ ప్రేక్షకులను సమానంగా అలరిస్తూ వచ్చాడు .

ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ పోతినేని 'ది వారియర్' మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఇది ఇలా ఉంటే రామ్ పోతినేని మరి కొన్ని రోజుల్లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక అనౌన్స్మెంట్ వచ్చి చాలా కాలమే అవుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 25 వ తేదీ నుండి రామోజీ ఫిలిం సిటీ లో ఒక సాంగ్ షూటింగ్ తో ప్రారంభం కాబోతున్నట్లు ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: