పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన షూటింగ్ త్వరలోనే మళ్లీ మొదలు కాబోతోంది. చాలా రోజుల గ్యాప్ త ర్వాత ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు పెట్టడం పట్ల పవన్ అభిమానులు ఎంతగానో సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్లుగా పవన్ అభిమానులు ఎదురుచూస్తూ ఉండగా గతంలో పవన్ కళ్యాణ్ సినిమాకు ఎదురైన ఇబ్బందులు ఈ సినిమాకి కూడా ఎదురవుతాయన్న వార్తలు బయటకు వస్తూ ఉండడం వారిలో ఎంతగానో కలవరాన్ని సృష్టిస్తుంది.

పవన్ నటించిన గత సినిమా భీమ్లా నాయక్  సినిమాకు చాలా ఇబ్బందులు తలెత్తాయి అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. సినిమా టికెట్ రేట్లను తగ్గించి ఆ సినిమాకు ఎక్కువగా కలెక్షన్లు రానీయకుండా చేసేసింది. ఏపీలోని ప్రభుత్వం ఆ విధంగా ఈ సినిమాకి కూడా అలాంటి ఇబ్బందులు వస్తాయి అన్నట్లుగా చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగానే ఈ సినిమాను కూడా వారు పూర్తి చేస్తున్నారట. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా మొగలుల కాలంనాటి చరిత్రకు సంబంధించిన ఈ సినిమాను వారు రూపొందిస్తున్నారు. 

కీరవాణి సంగీతం సమకూరుస్తూ ఉండగా ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి పవన్ కళ్యాణ్ రంగం సిద్ధం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ఎలాంటి ఇబ్బందులు వచ్చి వస్థాయో చూడాలి. ఇకపోతే ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ చాలా సినిమా ల ద్వారా ప్రేక్షకులను అలరించాల్సి ఉంది. త్వరలోనే అయన హరీష్ శంకర్ దర్శకత్వంలో అయన సినిమా ను మొదలుపెట్ట బోతున్నాడు. అని చెబుతున్నారు. ఇంకోవైపు ఆ సినిమా క్యాన్సల్ అయ్యిందని అంటున్నారు. ఈ రెండింటిలో ఏది నిజమో ఏది అబద్దమో తెలియాలంటే కొన్ని రోజులు ఎదురుచుదాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: