అఖిల్ కెరియర్ కు అత్యంత కీలకంగా మారిన ‘ఏజెంట్’ మూవీ ఏప్రియల్ 28 సెంటిమెంట్ ను బాగా నమ్ముకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే డేట్ న సీనియర్ ఎన్టీఆర్ ‘అడవిరాముడు’ మహేష్ ‘పోకిరి’ ప్రభాస్ ‘బాహుబలి’ పార్ట్ 1 విడుదలై కలక్షన్స్ విషయంలో చరిత్ర సృష్టించాయి. ఇప్పుడు అలాంటి అదృష్టం ‘ఏజెంట్’ కు పడుతుందని ఈమూవీ మేకర్స్ భారీ అంచనాలతో ఉన్నారు.


ఈసినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ టాక్ బాగున్నప్పటికీ సగటు ప్రేక్షకుడు ఈసినిమాను మొదటిరోజు మొదటి షో చూసిన తరువాత ఎలాంటి తీర్పు ఇస్తాడు అన్నవిషయమై అఖిల్ భవిష్యత్ ఆధారపడి ఉంది. పూర్తి యాక్షన్స్ సీన్స్ తో కూడుకున్న సినిమా కావడంతో ఈమూవీ పై కొన్ని సినిమాల ఛాయలు కనిపిస్తాయా అన్నసందేహాలు కూడ కొందరిలి ఉన్నాయి.


కమలహాసన్ ‘విక్రమ్’ యష్ ‘కేజీ ఎఫ్’ సినిమాల స్థాయిలో ఈమూవీలోని యాక్షన్ సీన్స్ ఉండబోతున్న నేపధ్యంలో మళ్ళీ అలాంటి సీన్స్ ‘ఏజెంట్’ లో చూపెడితే ఎంతవరకు సగటు ప్రేక్షకుడు చూస్తాడు అన్నసందేహాలు కూడ ఉన్నాయి. ఇప్పటివరకు అఖిల్ ను లవర్ బాయ్ ఇమేజ్ తో చూసిన సగటు ప్రేక్షకుడు అఖిల్ ను యాక్షన్ హీరోగా ఎంతవరకు ఆదరిస్తారు అన్నసందేహాలు కూడ కొందరికి ఉన్నాయి.


ఈసినిమాను ప్రమోట్ చేస్తూ అఖిల్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి కొన్ని ఆసక్తిర విషయాలు తెలియచేసాడు. తాను ఏపని అయినా మనసుపెట్టి చేస్తానని అలా చేసినప్పటికీ సరైన ఫలితం దక్కకపోతే తనకు నిరాశ ఏర్పడి ఒకొక్కసారి రెండు రోజులు వంటరిగా తన గదిలో ఉండిపోతానని అలాంటి పరిస్థితులలో తన తండ్రి నాగార్జున తన వద్దకు వచ్చి తండ్రిలా కాకుండా ఒక స్నేహితుడిలా తనకు ఇచ్చే మానసిక ధైర్యంతో తాను తన షాక్ నుండి కోలుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి అంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలను బట్టి అఖిల్ సున్నిత మనస్తత్వం అర్థం అవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: