తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నటుల్లో యువ నటుడు రామ్ పోతినేని ఒకరు. ఈయన ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో క్లాస్ ... మాస్ ఇమేజ్ కలిగిన సినిమాల్లో నటించి అద్భుతమైన గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ఆఖరిగా ఈ యువ నటుడు ది వారియర్ అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో రామ్ డాక్టర్ పాత్ర లను ... పోలీస్ ఆఫీసర్ గా రెండు విభిన్నమైన పాత్రలలో నటించి తన నటనతో ప్రేక్షకులను భాగానే ఆకట్టుకున్నాడు. కాకపోతే ఈ సినిమా కథ చాలా రొటీన్ గా ఉండడం ... కథనం అంతకు మించిన రొటీన్ గా ఉండడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది.

ఇలా ది వారియర్ అనే కమర్షియల్ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ ను అందుకున్న ఈ యువ నటుడు ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గ నటిస్తూ ఉండగా ... తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో ఒకే సారి విడుదల చేయనున్నారు.

మూవీ షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ఈ రోజు నుండి మైసూర్ లో ప్రారంభం అయింది. ఈ షెడ్యూల్ జూన్ 15 వరకు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తో ఈ మూవీ షూటింగ్ ఒక పాట మినహా మొత్తం పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో రామ్ పోతినేని పై అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలను మూవీ యూనిట్ చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: