రామ్ చరణ్ - వెంకి కుడుముల ప్రాజెక్ట్ గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నా దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చే విధంగా ప్రణాళిక వేసుకుంటూన్నాడట రామ్ చరణ్.. ఆ సస్పెన్స్ కి తెర దించేసే సమయం ఆసన్నమైందని తెలుస్తోంది. దసరాకి ఈ సినిమాని అధికారికంగా ప్రకటిస్తారట. రామ్ చరణ్ తేజ్ RRR సినిమా కోవిడ్ వల్ల షూటింగ్ తో పాటు రిలీజ్ ఆలస్యమవుతోంది. చిత్రీకరణ ముగించినా భారీ గా గ్రాఫిక్స్ పనులు చేయాల్సి ఉండగా ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమా పై అంతటా ఆసక్తి నెలకొంది.