మెగా స్టార్ కొరటాల శివ తో ఆచార్య సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కూడా మొదలు పెట్టుకుంది.. ఇటీవలే వచ్చిన మోషన్ పోస్టర్ కి అందరు ఫిదా అయ్యారు కూడా ఇంతవరకు బాగానే ఉంది.. కనీ ఈ సినిమా తర్వాత ఆయన చేసే తదుపరి సినిమాలపై ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.. ఈ సినిమా తర్వాత చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.. దీంతో మెగా ఫాన్స్ మెగా స్టార్ డెసిషన్ ని తప్పుపడుతున్నారు..