రాధే శ్యామ్ సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా రాబోతుందని ముందునుంచి ప్రచారం జరిగినా రాధే శ్యామ్` తరవాత ఆది పురుష్నే మొదలెట్టాలని ప్రభాస్ ఫిక్సయ్యాడు. దాంతో నాగ్ అశ్విన్ సినిమా కాస్త వెనక్కి వెళ్లింది.అంతేకాకుండా ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోందని ప్రచారం జరుగుతోంది. వీలైనంత త్వరగా ఈ సినిమాని మొదలెట్టాలని ప్రభాస్ భావిస్తున్నాడట. దాంతో ఆదిపురుష్ తర్వాత ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ ఈ రెండు సినిమా తర్వాత రావడం ఖాయమైపోయింది.