ఎన్టీఆర్ ఫాన్స్ RRR నుంచి తమ హీరో టీజర్ రిలీజ్ అవుతుందని ఆశించారు కానీ కరోనా వల్ల సినిమా టీజర్ రిలీజ్ కాలేకపోయింది.. ఇటీవలే దసరా కి ఎన్టీఆర్ కొమురం భీమ టీజర్ ని రిలీజ్ చేస్తామని రాజమౌళి చెప్పారు.. అంతేకాదు ఇటీవలే ఈ సినిమా షూటింగ్ డేట్ఈ ప్రకటించారు.. దసరా తర్వాత మొదలుకానుంది. టీజర్ కోసమే కొద్ది రోజుల క్రితం ప్రత్యేకంగా షూటింగ్ పెట్టారు. ఇంతకీ ఈ విడియో ఎలా వుండబోతోంది. దీని మీద ఆసక్తి కరమైన విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విడియోలో ఎన్టీఆర్ ను పలు గెటప్ ల్లో చూపిస్తారని తెలుస్తోంది.