గరుడవేగా ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమా చేయడానికి రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వాస్తవానికి ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ కన్నా ముందే తెరకెక్కాలి.. రాజశేఖర్ మార్కెట్ గురించి పట్టించుకోకుండా ‘గరుడవేగ’ను భారీ బడ్జెట్లో తీశాడు ప్రవీణ్. ఆ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా సరే.. ఓవర్ బడ్జెట్ వల్ల కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. రామ్‌తో అతను చేయాలనుకున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు సైతం బడ్జెట్ లెక్కలు ఘనంగా ఉండటంతో ఇది వర్కవుట్ కాదని రవికిషోర్ పక్కన పెట్టేశారని గుసగుసలు వినిపించాయి. అయితే గత ఏడాది ‘ఇస్మార్ట్ శంకర్’తో అతను బ్లాక్‌బస్టర్ విజయాన్నందుకున్నాడు. ఈ సినిమాతో అతడి మార్కెట్ ఎంతో పెరిగింది. దీని తర్వాత చేసిన ‘రెడ్’ మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. దానికి మంచి బిజినెస్ కూడా జరిగింది. దీంతో రవికిషోర్‌కు రామ్-ప్రవీణ్ సినిమా మీద పెద్ద బడ్జెట్ పెట్టడానికి ధైర్యం వచ్చిందట.