రాధే శ్యామ్ తాజా షెడ్యూల్ షూటింగ్ గత కొన్ని రోజులుగా ఇటలీలోని అందమైన లొకేషన్లలో జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ హీరో హీరోయిన్లు ప్రభాస్, పూజ హెగ్డే, మరికొందరిపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అలాగే, అక్కడ హీరో హీరోయిన్లపై కొన్ని పాటలను చిత్రీకరించడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ షూటింగ్ అక్కడ మరికొన్నాళ్ల పాటు కొనసాగుతుంది.ఇదిలావుంచితే, ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా తాజాగా జస్టిన్ ప్రభాకరన్ ను ఎంచుకున్నారు.