మెగా స్టార్ చిరంజీవి సినిమాల విషయంలో, కథ విషయంలో, డైరెక్టర్ ల విషయంలో ఎంత శ్రద్ధగా ఉంటాడో అందరికి తెలిసిందే.. కథ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా ఆ సినిమా ని పక్కనపెట్టేయడంలో ఎలాంటి ఆలోచన చేయదు.. గతంలో పూరి జగన్నాధ్ లాంటి పెద్ద దర్శకుడిని పక్కన పెట్టిన ఘనత చిరు ది. మలయాళ సినిమా లూసిఫర్ కి రీమేక్ కి మొదట్లో సుజిత్ దర్శకత్వం వహిస్తాడని వార్తలు రాగ స్క్రిప్ట్ విషయంలో సంతృప్తిగా లేని వినాయక్ కు ఛాన్స్ ఇచ్చారని వార్తలు వచ్చాయి.. అయితే వినాయక్ కూడా స్క్రిప్ట్ తో చిరు ని మెప్పించట్లేదని వార్తలు వినిపిస్తున్నాయి..