జబర్దస్త్ నుండి అవినాష్ వచ్చి తప్పుచేశాడా..? అదేంటి ఈ డౌట్ ఎందుకు వచ్చింది అనుకోవచ్చు. సూపర్ హిట్ ఎంటర్టైన్మెంట్ షో జబర్దస్త్ లో వన్ ఆద్ ది టీం లీడర్ గా ఉన్న అవినాష్ బిగ్ బాస్ షోలో ఛాన్స్ రాగానే వచ్చేశాడు. ఇక్కడ తనకు ఎక్కువ రెమ్యునరేషన్ ఆశ చూపారో లేక తనకున్న బయట సమస్యలకు ఇక్కడ విజేతగా నిలిచి ఆ సమస్యలను పరిష్కరించాలని అనుకున్నాడో ఏమో కాని బిగ్ బాస్ లో అవినాష్ జోకర్ గా ఎంట్రీ ఇచ్చి బెస్ట్ ఎంటర్టైనర్ గా నిలిచాడు.

హోస్ట్ నాగార్జుననే చాలాసార్లు అవినాష్ ఎంటర్టైన్మెంట్ గురించి నచ్చిందని చెప్పాడు. ఆయనే హౌజ్ లో నువ్వే బెస్ట్ ఎంటర్టైనర్ అని అన్నాడు. అయితే అవన్ని ఆడియెన్స్ ఓట్లు వేసేందుకు ఉపయోగపడటం లేదు. జోకర్ గా బిగ్ బాస్ హౌజ్ కు వచ్చిన అవినాష్ 13 వారాల తర్వాత జోకర్ గానే నిలుస్తున్నాడు. లాస్ట్ వీక్ నామినేషన్స్ లో ఎవిక్షన్ పాస్ ఉండటం వల్ల సేఫ్ అయ్యాడు కాని లేదంటే హౌజ్ బయట ఉండాల్సి వచ్చేది.

అయితే 13వ వారం కూడా అవినాష్ నామినేషన్స్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఎలిమినేషన్ అన్నది టఫ్ ఫైట్ గా సాగుతుంది. అయితే ఈసారి అవినాష్ మోనాల్ కు మధ్య పోటీ ఉంది. అవినాష్ కన్నా నేను ఎందులోనూ వీక్ కాదు అని ఆమె అన్నది. తను ఇంకా హౌజ్ రూల్స్ పాటించట్లేదని చెప్పింది. అవినాష్ ఫాలోవర్స్.. జబర్దస్త్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు అవినాష్ కు సపోర్ట్ గా నిలిచి అతన్ని సేఫ్ చేయాలని చూస్తున్నారు. అయితే కొందరు మాత్రం అవినాష్ ను కూడా తప్పుపడుతున్నారు. తన కామెడీతో ఇంకాస్త మెప్పించి ఉంటే బాగుండేది. అనవసరంగా అతను సీరియస్ అవుతూ అవతల వారిని తక్కువ చేసి చూస్తున్నాడని.. అదే అతనికి మైనస్ అవుతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: