టాలీవుడ్ టాప్ దర్శకుడు కొరటాల శివ కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలకు కథా రచయితగా పనిచేశాడు. కథా రచయితగా మంచి సక్సెస్ ను అందుకున్న కొరటాల శివ ఆ తర్వాత ప్రభాస్ హీరోగా అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్లు గా తెరకెక్కిన 'మిర్చి' సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత కొరటాల శివ శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను అనే సినిమాలకు దర్శకత్వం వహించి ఇప్పటివరకు ఫెయిల్యూర్ ని చూడని దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీ లో టాప్ ప్లేస్ లో నిలిచాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న  'ఆచార్య' సినిమా కు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి కి జంటగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో రామ్ చరణ్ కూడా కనబడబోతున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా దేశంలో కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటి వరకు హిట్స్ తప్ప పరాజయాలు ఎరుగని ఈ దర్శకుడు 'ఓటిటి' ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగులో  'ఓటిటి'  కల్చర్ బాగా పెరిగిపోయింది. గుర్తింపు పొందిన దర్శకులు, హీరోలు కూడా ఈ రంగంలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా హీరో నాగచైతన్య కూడా 'ఓటిటి' రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు. కొరటాల శివ కూడా తన దగ్గర ఉన్న కొన్ని కథలతో లో బడ్జెట్ సినిమాలను నిర్మించి, వాటిని 'ఓటిటి' లలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికోసం సొంతగా ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేస్తాడా, లేకపోతే స్నేహితుల  భాగస్వామ్యంతో సినిమాలను నిర్మిస్తాడా తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: