ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన  వాల్తేరు వీరయ్య సినిమా మరియు నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి రెండు సినిమాలు కూడా సంక్రాంతికి విడుదల బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని ఎందుకు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతేకాదు ఈ రెండు సినిమాలు కూడా భారీ కలెక్షన్లను అందుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ నటించిన ఈ రెండు సినిమాలను కూడా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. అయితే ఈ రెండు సినిమాలలో కూడా హీరోయిన్గా యూనివర్సల్ స్టార్ కమలహాసన్ నట వారసురాలు శృతిహాసన్ ఒకేసారి నటించింది.

ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలలో నటించిన అంటే అంత తేలికైన విషయం కాదు. అలాంటిది ఈమె ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో ఒకేసారి నటించి ఒకే సారి విడుదలై బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోవడం అనేది కేవలం శృతిహాసన్ కి మాత్రమే దక్కిన ఒక అరుదైన రికార్డు అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇదిలా ఉంటే ఇక శృతిహాసన్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అవుతుంది. అది ఏంటి అంటే ఇద్దరు స్టార్ హీరోల తో ఒకేసారి నటించిన శృతిహాసన్ రెండు సినిమాలకు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంది  అన్న చర్చలు జరుగుతున్నాయి.

ఈ సినిమాలు విడుదలై ఎన్ని రోజులు అవుతున్నప్పటికీ ఈ విషయంపై క్లారిటీ లేదు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వాల్తేరు వీరయ్య సినిమాకు శృతిహాసన్ ఎక్కువ రోజులు కేటాయించినందుకు గాను ఈ సినిమాకి ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుందని తెలుస్తోంది.బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాకి వాల్తేరు వీరయ్య సినిమాతో పోలిస్తే కాస్త తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుందని తెలుస్తోంది.సాధారణంగా ఎవరైనా సరే డేట్లను బట్టి రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటారు. కనుక వాల్తేరు వీరయ్య సినిమాకి ఎక్కువ రోజులు శృతిహాసన్ వర్క్ చేసింది కాబట్టి ఈ సినిమాకి శృతిహాసన్ రెమ్యూనరేషన్ తీసుకొని ఉంటుంది అని అంటున్నారు..!!.

మరింత సమాచారం తెలుసుకోండి: