ఏంటి అంత పెద్ద హీరో వెంకటేష్ ని డమ్మీ అని ఆ రైటర్ అవమానించారా..ఇంతకీ స్టార్ హీరో వెంకటేష్ ని డమ్మీ అని పిలిచింది ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..వెంకటేష్ రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తన కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. ఈ సినిమాతో 300 కోట్ల క్లబ్లో చేరిన సీనియర్ హీరోగా వెంకటేష్ సత్తా చాటారు. అయితే అలాంటి వెంకటేష్ తనని అవమానించారు అంటూ రైటర్ బెజవాడ ప్రసన్నకుమార్ ఆరోపించారు.. రైటర్ ప్రసన్నకుమార్ అంటే తెలియని వారు ఉండరు. ఇండస్ట్రీలో ఈయన కథలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే అలాంటి ఈయన నేను లోకల్, ధమాకా, నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్, నా సామి రంగా, మజాకా వంటి సినిమాలకు రచయితగా చేశారు. 

ఇక ఈయన రీసెంట్గా చేసిన మజాకా మూవీ మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే ఓ ఇంటర్వ్యూలో బెజవాడ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. నేను గతంలో వెంకటేష్ దగ్గరికి సినిమా కథ చెప్పడానికి వెళ్లాను. అయితే నేను చెప్పిన కథ వెంకటేష్ గారికి బాగా నచ్చింది. ఆ తర్వాత డేట్స్ ఇవ్వమని అడగడానికి వెళ్తే కథ మా అన్నయ్య కూడా వినాలి అని చెప్పారు. దాంతో సురేష్ బాబు గారికి నేను ఈ కథ చెప్పాను. కానీ సురేష్ బాబు ఈ కథ నాకు అస్సలు నచ్చలేదని, సినిమా చేయడం కుదరదని చెప్పేశారు.

దాంతో కథ నచ్చిందని వెంకటేష్ చెప్పి ఆ తర్వాత అన్నయ్యకు చెప్పమని డేట్స్ ఇవ్వకపోవడంతో నాకు అక్కడికి వెళ్ళాక చాలా అవమానంగా అనిపించింది. అందుకే వెంకటేష్ గారితో మళ్ళీ సినిమాలు చేయలేదు అంటూ రచయిత ప్రసన్నకుమార్ చెప్పుకొచ్చారు. అయితే ఈయన మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో కొంతమంది వెంకటేష్ అంటే పడని వాళ్ళు వెంకటేష్ డమ్మినేనా..కథలు ఆయన కాదు ఆయన అన్నయ్య వినాలా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: