పాకిస్తాన్ ఉగ్రవాదులు పహిల్ గామ్ లో జరిపిన దాడికి వ్యతిరేకంగా భారత దేశ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరిట మెరుపు దాడి చేసిన సంగతి మనకు తెలిసిందే.ఉగ్ర మూకల స్థావరాలే టార్గెట్ గా చేసుకొని ఇండియన్ ఆర్మీ మెరుపు దాడి చేసింది.ఈ నేపథ్యంలోనే ఇండియన్ ఆర్మీ చేసిన ఈ ఆపరేషన్ సింధూర్ ని చాలామంది ప్రశంసిస్తున్నారు. ఇందులో భాగంగా ఎంతోమంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ ఇండియన్ ఆర్మీ ని మెచ్చుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఆపరేషన్ సింధూర్ పై స్పందించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన పోస్ట్ వెంటనే డిలేట్ చేయాలని ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇంతకీ అల్లు అర్జున్ ఆయన పోస్టులో ఏమైనా తప్పు పెట్టారా..ఎందుకు అభిమానులు పోస్ట్ డిలీట్ చేయమంటూ డిమాండ్ చేస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. 

తాజాగా అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ఖాతాలో ఆపరేషన్ సింధూర్ అనే ఫోటోను షేర్ చేసి 'మేబీ జస్టిస్ సర్వ్డ్ .. జైహింద్' అంటూ రాసుకోచ్చారు.అయితే ఈ పోస్ట్ చూసిన చాలా మంది భారతీయులు గర్వపడుతున్నారు.భారతీయులంతా అల్లు అర్జున్ చేసిన పోస్ట్ ని ప్రశంసిస్తున్నారు. కానీ అభిమానులు మాత్రం తెగ హర్ట్ అయిపోయారు. అయితే భారత్ గురించి అంత గర్వంగా పోస్ట్ పెడితే అభిమానులు ఎందుకు హర్ట్ అవుతారని మీరు అనుకోవచ్చు.కానీ హర్ట్ అయ్యే అభిమానులు ఇండియన్స్ కాదు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ అభిమానులు. అల్లు అర్జున్ కి ఇంటర్నేషనల్ వైడ్ గా అభిమానులు ఉన్నారు.

అలా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన అల్లు అర్జున్ ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ పై పోస్ట్ పెట్టడంతో బంగ్లాదేశ్,పాకిస్తాన్లో ఉన్న ఆయన అభిమానులు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ మా ఫేవరెట్ హీరో నుండి ఇలాంటి పోస్ట్ అస్సలు ఉహించలేదు.. వెంటనే మా కోసం ఈ పోస్ట్ డిలీట్ చేయండి అంటూ ట్విట్టర్లో దాదాపు వేలాదిమంది హర్ట్ అయినట్టు కామెంట్స్ పెట్టడంతో పాటు డిసప్పాయింట్ అయినట్లు ఇమేజ్ లను కూడా పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ కి ఇంటర్నేషనల్ వైడ్ గా ఉన్న అభిమానాన్ని చూసి చాలామంది సైతం షాక్ అవుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన పోస్ట్ కి బంగ్లాదేశ్,పాకిస్తాన్ వంటి ఇతర దేశాల నుండి అభిమానులు చేస్తున్న రిక్వెస్ట్ కి సంబంధించిన పోస్టులు ట్రెండింగ్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: