
ప్రస్తుతం రాజమౌళితో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. ఇది పాన్ వరల్డ్ సినిమా. మహేష్ బాబు కెరీర్ లో 29వ సినిమాగా తెరకెక్కుతోంది. రాజమౌళితో ఓ సినిమా చేస్తే ఎలాంటి హీరో కెరీర్ అయిన ఎంత టాప్ పొజిషన్లోకి వెళుతుందో తెలిసిందే. అయితే ఆ తర్వాత సినిమాలను మాత్రం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అందుకే మహేష్ బాబు కూడా తన తర్వాత సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. మహేష్ కోసం టాలీవుడ్ లో ముగ్గురు దర్శకులు కథలు రెడీ చేస్తున్నారు. పెద్ది తర్వాత బుచ్చిబాబు సానా మహేష్ తో సినిమా చేస్తాడని అంటున్నారు. మహేష్ - సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన వన్ సినిమాకి బుచ్చిబాబు అసిస్టెంట్ దర్శకుడుగా పనిచేశారు. అప్పటినుంచి బుచ్చిబాబుకి మహేష్ తో మంచి అనుబంధం ఉంది. ఇక సందీప్ రెడ్డి వంగ కూడా మహేష్ తో సినిమా చేయబోతున్నాడు. అసలు బాలీవుడ్ రణబీర్ కపూర్ బ్లాక్ బస్టర్ యానిమల్ కథ ని ముందుగా మహేష్ కి వినిపించాడు. ఆ కథలో ఉన్న రా కంటెంట్ కి మహేష్ భయపడ్డాడు.
అలాంటి సీన్లలో నటిస్తే ఫ్యాన్స్ ఎలా రిసీవ్ ? చేసుకుంటాడో అని ఆలోచించాడు. అయితే సందీప్ కమిట్మెంట్ మహేష్ కు నచ్చింది. అందుకే మరో కథ ఉంటే తీసుకురా అని అప్పుడే చెప్పాడట. స్పిరిట్ తర్వాత సందీప్ మహేష్ సినిమా కోసం దృష్టి పెడతాడు. మరోవైపు నాగ్ అశ్విన్ కూడా మహేష్ కోసం ఒక కథ సిద్ధం చేస్తున్నట్టు ఇన్సైడ్ వర్గాల టాక్. వైజయంతి సంస్థ తెరకెక్కించే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. మరి ఈ ముగ్గురు దర్శకులలో మహేష్ ఎవరితో ముందుగా సినిమా చేస్తాడో ? చూడాలి. ఇక రాజమౌళి - మహేష్ బాబు సినిమా అయితే 2027 లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు