
అయితే దీపికా మాత్రం ఎక్కువ మొత్తంలో డబ్బులు అడగడం కారణంగా అంత డబ్బులు ఇచ్చుకోలేక సందీప్ ఈ సినిమా నుంచి ఆమెను తప్పించారట. ఆ ప్లేస్ లోకి తృప్తి వచ్చింది . అయితే తన పిఆర్ టీం తో సందీప్ రెడ్డివంగా స్పిరిట్ స్టోరీ మొత్తం లీక్ చేసేసింది అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ న్యూస్ తెగ వైరల్ గా మారింది . దానికి తగ్గటే సందీప్ రెడ్డి ఘాటుగా కౌంటర్ వేశారు . " సినిమా మొత్తం లీక్ చేసుకున్న నాకేం ఫరాక్ పడదు " అంటూ ఘాటుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు . దీంతో మొదలైన లొల్లి ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది.
అయితే దీపిక రెమ్యూనరేషన్ తో పాటు క్రేజీ క్రేజీ కండిషన్స్ కూడా పెట్టిందట. ఆ టైం కి వస్తా .. ఈ టైం కి వెళ్తే.. ఇష్టం వచ్చినట్లు చేస్తా .. ఇష్టం వచ్చిన కాస్టూమ్‌స్ వేసుకుంటాను .. నా ఫ్రెండ్స్ కి కూడా మీరే మిగతా ఖర్చులు చూసుకోవాలి అంటూ గొంతెమ్మ కోర్కెలు మొత్తం బయట పెట్టేసింది అంటూ సందీప్ రెడ్డి వంగ టీం దగ్గర నుంచి ఒక న్యూస్ బయటకు వచ్చింది . ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు తాజాగా కాజోల్ - అజయ్ దేవగన్ తమ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బయటకు వచ్చినప్పుడు అక్కడ మీడియా వాళ్ళు ఇదే విషయం కారణంగా ప్రశ్నించారు . "కొత్తగా తల్లి అయిన వారికి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పని అనేది ప్రతి ఒక్కరు పాటిస్తున్నారు. మరి బాలీవుడ్ లో కొంతమంది పాటిస్తున్నారా ..? దానికి వ్యతిరేకంగా ఉన్నారా ..?"అంటూ మీడియా అడగ్గా..కాజోల్ సమాధానం ఇచ్చేలోపే అజయ్ దేవగన్ మైక్ తీసుకొని "నిజాయితీ గల ఫిలిం మేకర్ ఎవరు కూడా దానికి వ్యతిరేకంగా ఉండరు. అందరూ కూడా ఎనిమిది తొమ్మిది గంటల పని కే ఒప్పుకుంటారు . చాలామంది అర్థం చేసుకుంటారు కూడా.. ప్రెసెంట్ ఇండస్ట్రిలో అదే పాటిస్తున్నాం .. అయితే ఇది పర్సన్ టూ పర్సన్ వేరే వేరేగా ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చాడు అజయ్ దేవగన్.
ఆయన ఎక్కడ సందీప్ రెడ్డి వంగ గురించి ఇది అంటూ నెగిటివ్గా మాట్లాడకపోయినా ఆయన మాట్లాడిన పద్ధతి చూస్తే ఖచ్చితంగా దీపికాకి ఫేవర్ గానే మాట్లాడాడు అని అజయ్ దేవగన్ - సందీప్ రెడ్డివంగా పై గుర్రుగా ఉన్నాడు అని సోషల్ మీడియాలో ఎక్కువగా కామెంట్స్ వినిపిస్తున్నాయి . సందీప్ రెడ్డి వంగ తన సినిమాల పట్ల ఎంత నిజాయితీగా ఉంటాడో తను హీరోయిన్-హీరో దగ్గర నుంచి అవుట్ ఫుట్ తీసుకునే విషయంలో కూడా అంతే నిజాయితీగా ఉంటాడు . ఈ మిగతా వర్కింగ్ అవర్స్ అంటారా అందరిలాగే సందీప్ రెడ్డి ఫాలో అవుతాడు . కేవలం దీపికాని సపోర్ట్ చేయడానికి ఇంతమంది బాలీవుడ్ స్టార్స్ సందీప్ కు యాంటీగా మారిపోతూ ఉండడం సందీప్ రెడ్డి ఫ్యాన్స్ కి కూడా మింగుడు పడడం లేదు. కాజోల్ దీని పై స్పందించిన వేరేలా ఉండేది . అజయ్ దేవగన్ స్పందించి మొత్తం పెంట పెంట చేసేసాడు అంటున్నారు జనాలు..!