ఈ మధ్యకాలంలో థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల కన్నా.. రీరిలీజ్ అయ్యే సినిమాలే ఎక్కువ ఉన్నాయి. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమా కూడా రీరిలీజ్ అయ్యింది. ఈ మూవీలో హీరోయిన్ గా అనుష్క శెట్టి నటించారు. ఈ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. మొదటి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా హిట్ కొట్టలేకపోయినా.. ఈసారి మాత్రం మంచి కలెక్షన్స్ ని సంపాదిస్తుంది. ఈ మూవీ థియేటర్ లోకి వచ్చి ఫ్లాప్ అయ్యింది.. కానీ తర్వాత ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

దీంతో ఈ సినిమా రీరిలీజ్ అయ్యింది. ఇక ఇటీవల ఈ సినిమా రీరిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ రాబట్టింది. దానికి సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఖలేజా సినిమా మొదటి రోజే ఏకంగా 8.26 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుని ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది. ఇక వీకెండ్ కూడా దగ్గరలో ఉండడంతో కలెక్షన్ లు మరింత పెరుగుతాయని టాక్ వినిపిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ సంబరపడిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు అభిమాని ఒకరు.. 2010లో ఫెయిల్ అయిన ఈ సినిమా 2025లో సప్లమెంటరీ రాసి డిస్టింక్షన్ లో పాస్ అయిందంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు.
 
ఇకపోతే ప్రిన్స్ అందం గురించి ఎంత పొగిడిన అతిశయుక్తి కాదు. ప్రస్తుతం మహేష్ బాబు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఎట్టకేలకు సినిమా రాబోతుంది. ఎస్ఎస్ఎంబి 29 మూవీ షూటింగ్  కూడా మొదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కె.ఎల్‌.నారాయణ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నటిస్తుంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్లు ఉంటుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: