యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 31` వ‌ర్కింగ్ టైటిల్ తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి `డ్రాగన్ ` అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. ఇటీవ‌లె ఎన్టీఆర్ ఫస్ట్ షెడ్యూల్ ను కూడా కంప్లీట్ చేసుకున్నాడు.


ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న డ్రాగ‌న్‌.. 2026 జూన్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారింది. డైరెక్ట‌ర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రంలో ఓ అదిరిపోయే స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. అయితే ఆ సాంగ్ టాలీవుడ్ హాట్ బ్యూటీ కేతిక శర్మ చేయనుందని వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా చిత్ర‌బృందం కేతిక‌ను సంప్ర‌దించ‌గా.. ఆమె వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని బ‌లంగా టాక్ న‌డుస్తోంది.


అయితే ఈ విష‌యంపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే. కాగా, ఇటీవ‌ల నితిన్ హీరోగా తెర‌కెక్కిన `రాబిన్‌హుడ్‌ ` మూవీలో ` అది దా సర్ప్రైజు` అంటూ కేతిక శ‌ర్మ ఓ ఊపు ఊపేసింది. సినిమా రిజ‌ల్డ్ ఎలా కేతిక చేసిన స్పెష‌ల్ సాంగ్ మాత్రం బాగా వైర‌ల్ అయింది. అలాగే ఇటీవ‌ల హీరోయిన్ గా `సింగిల్‌ ` మూవీతో క్రేజీ హిట్ ను అందుకుంది. ఇక‌ ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ తో స్టెప్పులేసి అవ‌కాశం కేతిక‌కు ద‌క్కింద‌ని వార్త‌లు రావ‌డంతో.. ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: