దుల్కర్ సల్మాన్ మలయాళ నటుడే అయినప్పటికీ సౌత్ మొత్తంలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా తెలుగులో `సీతా రామం`, `లక్కీ భాస్కర్` వంటి సూపర్ హిట్ చిత్రాలతో తనదైన మార్క్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం దక్షిణాదిలో అగ్ర హీరోగా వెలుగొందుతున్న దుల్కర్ సల్మాన్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు అత్యంత ఇష్టమైన హీరోయిన్ ఎవరన్నది రివీల్ చేశాడు.


బాలీవుడ్ బ్యూటీ కాజోల్ అంటే దుల్కర్ కు పిచ్చట. ఒక్కసారైనా ఆమెతో కలిసి వర్క్ చేయాలని దుల్కర్ ఎప్పటినుంచో ఆశపడుతున్నాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బయటపెట్టారు. దుల్కార్ మాట్లాడుతూ.. `ప్రతి సినిమాలో కాజోల్ తన పాత్రకు ప్రాణం పోసే తీరు ఎంతో అద్భుతంగా ఉంటుంది.. ఆమె నవ్వు చాలా సహజంగా ఉంటుంది. గుండెల్లో నుంచి ఆ నవ్వు వచ్చినట్లు ఉంటుంది. ఎమోషనల్ రోల్స్ ను కూడా రియలిస్టిక్ గా చేస్తుంది. ప్రతి పాత్రను చిత్తశుద్ధితో పోషిస్తుంది. అందుకే కాజోల్ అంటే నాకు చాలా ఇష్టం. ఆమెతో కలిసి ఒక‌సారైనా నటించాలని ఉంది` అంటూ దుల్కర్ సల్మాన్ చెప్పుకొచ్చాడు. మరి ఆయన కోరిక నెరవేరుతుందా? లేదా? అన్నది చూడాలి.


కాగా, ప్ర‌స్తుతం దుల్క‌ర్ స‌ల్మాన్ తెలుగులో పవన్ సాదినేని దర్శకత్వంలో `ఆకాశం లో ఒక తార` అనే సినిమా చేస్తున్నాడు. అలాగే త‌మిళంలో స్వీయ నిర్మాణంలో `కాంత‌` అనే చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు. ఇందులో రానా ద‌గ్గుబాటి కూడా యాక్ట్ చేస్తున్నాడు. అదేవిధంగా మ‌ల‌యాళంలోనూ దుల్క‌ర్ ఓ మూవీకి సైన్ చేశాడు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: