పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితం హరిహర వీరమల్లు అనే సినిమాను మొదలు పెట్టాడు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యాక అనేక అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ చాలా డిలే అవుతూ వచ్చింది. దానితో ఈ మూవీ స్టార్ట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ మొదలు పెట్టిన భీమ్లా నాయక్ , బ్రో సినిమాలు కూడా విడుదల అయ్యాయి. కానీ ఈ మూవీ మాత్రం ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇకపోతే ఇంత కాలం పాటు రాజకీయాలతో అత్యంత బిజీగా ఉన్న పవన్ కొంత కాలం క్రితమే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేశాడు.

దానితో ఈ చిత్ర బృందం ఈ మూవీ కి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసింది. రేపు అనగా జూలై 24 వ  తేదీన ఈ మూవీ గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడానికి రెడీ అయింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన కానీ యూఎస్ ప్రీమియర్స్ కు సంబంధించి ఉత్కంఠ మాత్రం ఇంత కాలం పాటు నెలకొనే ఉంది. కానీ ఆ ఉత్కంఠ ఇప్పుడు క్లియర్ అయిపోయింది. హరిహర వీరమల్లు మూవీ యూఎస్ ప్రీమియర్స్ కు తాజాగా లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. డిజిటల్ ప్రింట్ల ఆలస్యంతో నిన్నటి వరకు ఈ మూవీ పై కాస్త సస్పెన్షన్ నెలకొంది. ఇవాళ రాత్రి నుంచి ఇక్కడ ప్రత్యేక షో లు స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ మూవీ మొదలైంది.

ఆ తర్వాత ఈయన ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. దానితో జ్యోతి కృష్ణ అనే దర్శకుడు ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన భాగం షూటింగులు పూర్తి చేశాడు. నీది అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు. ఈ మూవీ ఏ ఏం రత్నం ని నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: