పవన్ కళ్యాణ్ ని దగ్గరనుంచి చూడాలని .. పవన్ కళ్యాణ్ పక్కన నిల్చుని ఫోటో దిగాలి అని.. పవన్ కళ్యాణ్ ని పట్టుకోవాలి అని ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కి ఉంటుంది . కానీ ఆ అదృష్టం అందరికీ రాదు. అలా వస్తే మాత్రం ఏ అభిమాని మిస్ చేసుకోరు . పక్క వాళ్ళు ఏమనుకుంటారో..?? ఎదుటి వాళ్ళు చులకనగా చూస్తారేమో..?? ఇలాంటి క్వశ్చన్స్ ఏవి తవ మైండ్ లో తట్టవు . పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నాడా ఓకే.. మన ఫేవరెట్ హీరో ఉన్నాడు ఒకసారి చేయి పట్టుకొని ఫోటో దిగేద్దాం అన్న విధంగానే ముందుకు వెళుతూ ఉంటారు. కాగా రీసెంట్ గానే అలాంటి ఆసక్తికర ఘటనే చోటు చేసుకుంది.


మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా నిన్న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఈ సినిమాకి ఇంత మంచి సూపర్ డూపర్ హిట్ టాక్ రావడంతో చిత్ర బృందం నిన్న సాయంత్రం సక్సెస్ మీట్ నిర్వహించింది . ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు హైలెట్ గా మారాయి . అలాగే ఆయన స్పీచ్ ఇస్తున్న మూమెంట్లో సినిమాల విషయంలో కొందరు చేసిన కామెంట్లకు  తనదైన స్టైల్ లో కౌంటర్లు కూడా ఇచ్చారు. అంతేకాదు ఈ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన కూడా చోటు చేసుకుంది .



ఆయన మాట్లాడుతూ ఉన్న మూమెంట్లో అక్కడే కూర్చుని ఉన్న నివిక అనే ఆర్టిస్టును గుర్తించి "మీరు హరిహర వీరమల్లు సినిమాలో నటించారు కదా..??" అంటూ అడుగుతారు.  అంతేకాదు ఆమె ఒక ఫోటో కావాలి సార్ అని అడగ్గా వెంటనే స్టేజి పైకి రమ్మని పిలుస్తారు. స్టేజి పైకి రాగానే ఆ అభిమాని ఆనందం పట్టలేక స్టేజి పైన ఎగిరి గంతేసింది . అంతేకాదు పవన్ కళ్యాణ్ హ్యాండ్  పట్టుకొని దగ్గరగా ఫోటో తీసుకుంది . ఈ సన్నివేశం అక్కడ ఉన్న వారిని కూడా ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది. ప్రతిసారి ప్రజల్లోకి పవన్ కళ్యాణ్ వస్తూనే ఉంటారు.  ఆయన ను చూసేందుకు జనాలు ఎంతలా ఎగబడిపోతూ ఉంటారో అందరికీ తెలుసు . పవన్ అంటే జనాలకి ఎంత అభిమానం అనే విషయం మరొకసారి రుజువైంది. ప్రజల్లో పవన్ కళ్యాణ్ రేంజ్ ఈ లెవెల్ లో ఉంటుంది అంటూ ప్రూవ్ అయింది. దీంతో ఈ వీడియోని తెగ ట్రెండ్ చేస్తున్నారు జనాలు . పవన్ కళ్యాణ్ పక్కన నిల్చోని ఫోటో తీసుకున్నావ్ నువ్వు లక్కీ ఛాన్స్ కొట్టేసావు నివిక అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు . రాజకీయాలలో బిజీగా ఉన్న సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ తో ఆయన కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేసే పనిలో బిజీ అవుతున్నారు..!!



మరింత సమాచారం తెలుసుకోండి: